పదేండ్లుగా ప్రజాసేవ చేస్తున్నా : గడ్డం వంశీకృష్ణ

పదేండ్లుగా ప్రజాసేవ చేస్తున్నా : గడ్డం వంశీకృష్ణ

తాను పదేండ్లుగా విశాక చారిటబుల్​ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తన తాత కాకా హయాం నుంచి ఈ ప్రాంతంతో తమ ఫ్యామిలీకి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వెంకటస్వామి సింగరేణికి రూ.450 కోట్ల లోన్ మాఫీ చేయించి లక్ష ఉద్యోగాలను కాపాడారన్నారు. పేదలకు 70 వేల ఇండ్లు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పిలిపించుకున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ హయాంలోనే పెన్షన్, రేషన్ సిస్టం అమల్లోకి వచ్చాయన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్​ను నమ్మితే ఇసుక దందా, భూదందా చేసి దోచుకున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. మీ ఆశీర్వాదం కావాలి. ప్రేమ్ సాగర్ రావు మీద చూపించిన ప్రేమలో కొంచెం నా మీద చూపించినా చాలు” అని అన్నారు. 

కాకా వెంకటస్వామికి ప్రేమ్​సాగర్​రావు తండ్రి రఘుపతిరావుతో మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో తనను గెలిపిస్తే జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం, సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను రద్దు కోసం, ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.