15 ఏళ్ల క్రితం మిస్సైన పోలీస్.. ఇప్పుడు ఫుట్‌పాత్ మీద..

15 ఏళ్ల క్రితం మిస్సైన పోలీస్.. ఇప్పుడు ఫుట్‌పాత్ మీద..

మానసిక సమస్యలతో బాధపడుతూ 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్.. ఫుట్‌పాత్ మీద చలికి వణుకుతూ ఆహారం కోసం అర్థిస్తూ కనిపించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మనీష్ మిశ్రా 1999లో డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ఆయన 2005లో డేటియాలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా మిస్సయ్యాడు. ఆయన అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.

కాగా.. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న రత్నేష్ సింగ్ తోమర్ మరియు విజయ్ సింగ్ బహదూర్ మంగళవారం రాత్రి నగరంలోని ఒక ఫంక్షన్ హాల్ పక్కగా వెళ్తున్నారు. వారు ఆ సమయంలో ఫుట్‌పాత్ మీద బిచ్చగాడులా కనిపించే ఒక వ్యక్తిని చూశారు. అతడు చలికి వణుకుతూ.. ఆహారం కోసం అర్థిస్తున్నాడు. అది చూసిన తోమర్ మరియు బహదూర్ వెంటనే తమ కారును ఆపారు. అతని దగ్గరికి వెళ్లి ఒక జాకెట్ ఇచ్చారు. అది తీసుకున్న ఆ వ్యక్తి.. తోమర్ మరియు బహదూర్‌లను పూర్తి పేరుతో పిలిచాడు. అది విని వారిద్దరూ షాక్ అయ్యారు. మా పేరు ఇతనికెలా తెలుసు అని అతన్ని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. ఆ వ్యక్తి తమతో పాటు డిపార్ట్‌మెంట్‌లో చేరిన మనీష్ మిశ్రా అని గుర్తించారు. వెంటనే అతన్ని తీసుకొని వెళ్లి ఒక ఎన్జీవోలో చేర్పించారు. మిశ్రా కోసం మరిన్ని ఏర్పాట్లు చేసేంతవరకు ఆ ఎన్జీవోలో ఉంచుతామని గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ డీఎస్పి తోమర్ అన్నారు. ఇన్ని సంవత్సరాలు మిశ్రా ఆచూకీ ఎవరికీ తెలియదని ఆయన అన్నారు.

‘మిశ్రా మంచి అథ్లెట్ మరియు షార్ప్ షూటర్. అతను 1999లో మాతో పాటు పోలీసు బలగాలలో చేరాడు. అతను కొన్ని సంవత్సరాల తరువాత మానసిక సమస్యలతో బాధపడటం ప్రారంభించాడు. అతని కుటుంబం అతనికి చికిత్స చేయించింది. కానీ, కొంతకాలం తర్వాత అతను కనిపించకుండా పోయాడు. మేం మిశ్రాకు స్నేహితులం. అతనికి మంచి వైద్యం చేయించి మామూలు వ్యక్తిలా మారుస్తాం’ అని డీఎస్పీ తోమర్ అన్నారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 661 కరోనా కేసులు

పండగపూట షోరూం దోచుకెళ్లిన దొంగలు

కరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి

13 ఏళ్ల బ్యాన్ తర్వాత అందుబాటులోకి గర్భనిరోధక మాత్రలు