బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీ కృష్ణ పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీ కృష్ణ పరామర్శ

కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం పర్యటించారు. ఇటీవల కాసిపేట మండలం ముత్యంపల్లిలో మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావు నాన్నమ్మ విజయలక్ష్మి, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్​మునిమంద స్వరూప తండ్రి మాదరబోయిన రాజం చనిపోగా బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. 

అంతకుముందు బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో వందేభారత్, నవజీవన్, ఏపీ ఎక్స్‌ప్రెస్, కేరళ, గరీబ్ రథ్, జీటీ, హైదరాబాద్–నాగపూర్ సూపర్ ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్ కు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, లీడర్లు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. 

మూడో ప్లాట్ ఫాం విస్తరణ, రైల్వే హెల్త్ సెంటర్​ను ఏరియా హాస్పిటల్​గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట కాంగ్రెస్ లీడర్లు రఘునాథ్ రెడ్డి, బండి సదానందం యాదవ్,​కేవీ.ప్రతాప్, మునిమంద రమేశ్, హరీశ్, సబ్బని రాజనర్సు, ఎలిగేటి శ్రీనివాస్, ఎరుకల శ్రీనివాస్, దూడపాక బలరాం తదితరులు ఉన్నారు.