ఫ్రిడ్జ్​​లో బాటిల్‌ తీస్తుండగా విద్యుత్‌ షాక్‌.. ఎంపీటీసీ మృతి

ఫ్రిడ్జ్​​లో బాటిల్‌ తీస్తుండగా విద్యుత్‌ షాక్‌.. ఎంపీటీసీ మృతి

ఏటూరునాగారం, వెలుగు : ఫ్రిడ్జ్​​లో నుంచి వాటర్‌ బాటిల్‌ తీస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో ఓ ఎంపీటీసీ చనిపోయింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం మల్యాలలో సోమవారం(జూన్ 05) జరిగింది. కొండాయి ఎంపీటీసీ మల్లెల ధనలక్ష్మి (36) సోమవారం(జూన్ 05) మల్యాలలోని తన ఇంట్లో ఫ్రిడ్జ్‌ డోర్‌ ఓపెన్‌ చేసింది. ఈ టైంలో విద్యుత్‌ షాక్‌ కొట్టింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికే ఆమె చనిపోయింది.