అభిమానులకు ఎంఎస్ ధోని బిస్కెట్..

అభిమానులకు ఎంఎస్ ధోని బిస్కెట్..

ఊరించి ఉసూరుమనించడమంటే ఇదేనేమో. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఏదో చెప్తాడు..ఇంకేదో అనౌన్స్ చేస్తాడని అంతా అనుకున్నారు. సంచలన ప్రకటన చేస్తాడని భావించారు. ధోని ప్రకటన మామూలుగా ఉండదని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ..అందరి అంచనాలు పటాపంచలు చేశాడు. అభిమానుల అంచనాలను నీళ్లు చల్లేశాడు. ఓస్ ఇంతేనా? దీనికే ఇంత బిల్డప్పా అనుకునేటట్లు చేశాడు.

సోషల్ మీడియా వేదికగా ధోని ప్రకటన..

రెండేళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని..అప్పటి నుంచి  చెన్నై తరపున ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే గతేడాదే సీఎస్‌కేకు కూడా గుడ్ బై చెబుతాడని ప్రచారం జరిగింది. కానీ సొంత మైదానం చెన్నై స్టేడియంలో అభిమానుల సమక్షంలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని ధోని ప్రకటించాడు. అయితే శనివారం తాజాగా సోషల్ మీడియా వేదికగా ధోనీ కీలక ప్రకటన చేశాడు. సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 2 గంటలకు ఫేస్‌బుక్‌లో లైవ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేస్తానన్నాడు. ధోని ప్రకటనతో ఎవరికి వారు ఏదేదో ఊహించుకున్నారు. ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం కూడా జరిగింది. 

ధోనీ బిస్కెట్...


ఏం చెప్తాడో అని ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్కు ధోని షాకిచ్చాడు. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ అయిన ఓరియోను మరోసారి ధోని లాంచ్ చేశాడు. 2011లో ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను ప్రారంభించినప్పుడు భారత్ వరల్డ్ కప్ గెలిచిందని చెప్పాడు. వచ్చే నెల టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను మరోసారి ప్రారంభించినందున.. భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని ధోని చెప్పుకొచ్చాడు. 

ఫ్యాన్స్ ఆగ్రహం..

ధోని రిటెర్మెంట్ ప్రకటించలేదని కొందరు అభిమానులు ఊపిరి పీల్చుకోగా..మరికొందరు ఎమోషన్స్తో ఆడుకుంటాడా అని మండిపడుతున్నారు. కమర్షియల్ ప్రాజెక్టుల కోసం అభిమానాన్ని బలిపెట్టొద్దని సూచిస్తున్నారు. అడ్వర్టైజ్ మెంట్ కోసం ఫ్యాన్ ఫాలోయింగ్‌ను వాడుకున్న ధోనీ కమర్షియాలిటీని తప్పుపడుతున్నారు.