ఏప్రిల్ 18 నుంచి రామప్ప ఉత్సవాలు

ఏప్రిల్ 18 నుంచి రామప్ప ఉత్సవాలు
  • 18 నుంచి రామప్ప ఉత్సవాలు
  • శిల్పం.. కృష్ణం.. వర్ణం పేరుతో నిర్వహణ
  • ములుగు అడిషనల్‌ కలెక్టర్ ఇలా త్రిపాఠి

వెంకటాపూర్ (రామప్ప)/ములుగు, వెలుగు : ‘శిల్పం.. వర్ణం.. కృష్ణం’ పేరిట ఈ నెల 18న రామప్పలో జరిగే ఉత్సవాలను సక్సెస్ చేయాలని ములుగు అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా రామప్ప ఆలయ విశిష్టత, కాకతీయుల వైభవం తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వెజిటేరియన్ స్టాల్స్, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆఫీసర్లతో కో ఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం స్టార్ట్ అవుతుందన్నారు. సాయంత్రం 5 గంటల  నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమాలకు మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ తో పాటు, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శివమణి, సింగర్ కార్తీక్, బలగం సినిమా టీం హాజరుకానున్నట్లు చెప్పారు. అంతకుముందు జలవనరుల మండలి చైర్మన్ వీరమల్ల ప్రకాశ్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, రామప్ప హెరిటేజ్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ పాండురంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందనాయక్‌ తో కలిసి పోస్టర్‌ను  ఆవిష్కరించారు. కార్యక్రమంలో  డీఆర్వో కె.రమాదేవి, జడ్పీ సీఈవో ప్రసన్నరాణి, వెంకటాపూర్ జడ్పీటీసీ రుద్రమదేవి, ఎంపీపీ తడుక భాగ్యలక్ష్మి, పాలంపేట సర్పంచ్ బుర్రి రజిత, వెంకటాపూర్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, డీపీవో వెంకయ్య, డీడబ్ల్యూవో ప్రేమలత, కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్ పాల్గొన్నారు.