
మహారాష్ట్ర ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. మరాఠా ఉద్యమం ఐదో రోజుకు చేరుకోవటం.. ముంబై వీధుల్లో మరాఠా కుర్రోళ్ల రాకపోకలతో ట్రాఫిక్ జామ్స్.. హైకోర్టు ఆదేశాలు.. మరో వైపు గణేష్ నిమజ్జనం ఇలా.. ముంబై సిటీ హై టెన్షన్ నెలకొంది. అంతేనా ముంబై సిటీ అంతా గంభీర వాతావరణం నెలకొంది.
మరాఠాలకు ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ.. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ మనోజ్ జరంగే పాటిల్ ఆమరణ దీక్షకు దిగటం ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ఒక్క రోజు దీక్ష అంటూ ముంబైలోని ఆజాద్ స్టేడియంలో దీక్షకు దిగారు. ఒక్క రోజు పర్మీషన్ తీసుకుని.. నిరాహార దీక్షకు కంటిన్యూ చేయటంతో ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరాఠా కుర్రోళ్లు.. యువత పెద్ద ఎత్తున ముంబై చేరుకోవటం..5 లక్షల మంది యువత భారీ నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు వస్తున్న వార్తలతో ఫడ్నవీస్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. దీక్ష విరమించి.. ముంబై వదిలి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్ చూపిస్తూ వెంటనే ఆజాద్ స్టేడియం ఖాళీ చేయాలంటూ ఉద్యమ నేత మనోజ్ జొరేంగా పాటిల్ ను ఆదేశించింది.
►ALSO READ | ఆటో ట్రాన్స్‌షిప్‌మెంట్ కోసం ఫస్ట్ స్పెషల్ పోర్టు.. దేశంలో ఎక్కడంటే..?
దీనిపై మనోజ్ రియాక్ట్ అయ్యారు. చావనైనా చస్తాను.. ముంబై వదిలిపెట్టను.. మరాఠా యువతకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు ముంబై విడిచిపెట్టను.. దేనికైనా సిద్ధమే అంటూ ప్రకటించటంతో ముంబై సిటీ మొత్తం హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ముంబైలోని చాలా రైల్వేస్టేషన్లలో నాలుగు రోజులుగా వేలాది మంది మరాఠా నిరసనకారులు ఉన్నారు. వీళ్లందరూ బయటకు రావొద్దని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదే క్రమంలో.. తన మద్దతుదారులు, నిరసనకారులకు ఉద్యమ నేత మనోజ్ సందేశాలు పంపారు. సిటీలోకి ఎవరూ వాహనాలతో రావొద్దని.. అందరూ రైళ్లు, బస్సులు వంటి ప్రజా రవాణాలోనే ప్రయాణించాలని.. ట్రాఫిక్ అంతరాయం కల్పించొద్దని పిలుపునిచ్చారు మనోజ్. ముంబై రైల్వేస్టేషన్లు, బీఎంసీ దగ్గర పార్క్ చేసిన వాహనాలను తొలగించాలని సూచించారాయన.
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో.. మరాఠాలకు ప్రత్యేకంగా 10 శాతం అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కొన్నేళ్లుగా మనోజ్ పాటిల్ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈసారి అందుకు భిన్నంగా.. గణేష్ నవరాత్రుల సమయంలో.. ముంబై సిటీ నడిబొడ్డున దీక్షకు దిగటం.. లక్షల మంది మరాఠా యువత ముంబై సిటీలోకి రావటంతో అంతా గందరగోళం.. టెన్షన్ నెలకొంది.