పెళ్లి చేసుకోవటానికి.. ఇన్ని కష్టాలు పడాలా.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదీ..

పెళ్లి చేసుకోవటానికి.. ఇన్ని కష్టాలు పడాలా.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదీ..

ముంబైలో వీల్‌చైర్‌ను ఉపయోగించే ఓ వికలాంగ మహిళ తన పెళ్లి రోజున నగరంలోని మ్యారేజ్ రిజిస్ట్రార్ రెండవ అంతస్తులో ఉన్న కార్యాలయానికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ భవనంలో లిఫ్ట్ లేదు. లాంఛనాలు పూర్తి చేయడానికి అధికారులు కిందకు దిగడానికి నిరాకరించడాన్ని ఆ మహిళ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

"ఇది ఎంతవరకు న్యాయం? యాక్సెసిబుల్ ఇండియా ప్రచారానికి ఏమైంది? వీల్‌చైర్ వాడుతున్నందుకు నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు నాకు లేదా? పెళ్లిరోజున నేను ఎక్కడైనా జారిపడి ఉంటే, లైదా నేడు పడిపోయి ఉంటే.. ఎవరు బాధ్యత వహిస్తారు?" అని వికలాంగుల హక్కుల కార్యకర్త విరాలీ మోడీ ప్రశ్నించారు. "నేను వికలాంగురాలిని. నేను 16/10/23న ఖార్ ముంబైలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నాను. కార్యాలయంలో లిఫ్ట్ లేకుండా 2వ అంతస్తులో ఉంది. సంతకాల కోసం వారు కిందికి రాకపోవడంతో నన్ను ఓ ఇద్దరు కలిసి పైకి తీసుకెళ్లాల్సి వచ్చింది. పెళ్లి చేసుకోవడానికి మెట్లు ఎక్కాలి’’ అని మోడీ ఎక్స్‌లో రాసుకువచ్చారు.

Also Read :- నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై స్పందించారు. సమస్యను పరిశీలిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. "మొదటగా కొత్త ప్రారంభానికి అభినందనలు. మీ ఇద్దరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా, అందమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు కలిగిన అసౌకర్యానికి నేను నిజంగా చింతిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా దీన్ని గుర్తించాను. దీన్ని సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుంటాను" అని ఆయన చెప్పారు.

ఈ ట్వీట్ పై ఓ యూజర్ చేసిన కామెంట్ కు.. మోడీ ఘాటుగా స్పందించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. "మీ భర్త మీ జీవితాంతం మిమ్మల్ని మోయగలిగితే అదే పెద్ద పరీక్ష" అని యూజర్ అనగా.. "నా భర్త నా కేర్‌టేకర్ కాదు. అతను వచ్చాక, రాకముందు కూడా నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను. నా ప్రభుత్వం ఇప్పటికే నా అవసరాలకు అనుగుణంగా అన్ని అవసరాలను సమకూరుస్తోంది కావున అతను నన్ను మోయాల్సిన అవసరం లేదు. ఈ రకమైన మనస్తత్వాన్ని మానుకోండి" అని ఆమె చెప్పింది.