ఇంత కసిగా చనిపోవటం ఏంటయ్యా : సిటీలోని ఫ్లైఓవర్ కు ఉరేసుకున్న వ్యక్తి

ఇంత కసిగా చనిపోవటం ఏంటయ్యా : సిటీలోని ఫ్లైఓవర్ కు ఉరేసుకున్న వ్యక్తి

మహారాష్ట్రలోని జాల్నాకు చెందిన ఓ వ్యక్తి అక్టోబర్ 19న తెల్లవారుజామున మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల కోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఫ్లైఓవర్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని సునీల్ బాబూరావు కవ్లే (35)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో వారు ఒక మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ లో.. అతను తన జీవితాన్ని ముగించాలని తీసుకున్న నిర్ణయానికి అందరి నుండి క్షమాపణ కోరుతున్నట్టు ఉంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కావ్లే అక్టోబర్ 17న అర్థరాత్రి జాల్నా నుంచి ఛత్రపతి సంభాజీనగర్ మీదుగా వచ్చారు. ఆ తర్వాతి రోజు రాత్రి అతను బాంద్రా తూర్పులోని ఫ్లైఓవర్‌పై ఒక ప్రదేశానికి వెళ్లి ఉరివేసుకున్నాడు. మరాఠా క్రాంతి మోర్చా కన్వీనర్లు వీరేంద్ర పవార్, వినోద్ పాటిల్ కౌలే.. కావ్లే మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. "రిజర్వేషన్ల పోరాటాన్ని సగంలో వదిలేసి, నిరుత్సాహపడకూడదని, ఆత్మహత్యల్లాంటి తీవ్రమైన చర్యలను ఆశ్రయించవద్దని" ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"ఇది చాలా బాధాకరమైన పరిణామం. మేము మా కార్యకర్తలను సంఘటనా స్థలానికి పంపి జాల్నాలో ఉన్న అతని కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించాము. అతను ఏ పని చేస్తున్నాడు, అతని జీవితాన్ని ముగించడానికి రెచ్చగొట్టడానికి గల కారణాలను మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము" అని పవార్ అన్నారు. అనంతరం కౌలే మృతదేహాన్ని శవపరీక్ష కోసం సియోన్ ఆసుపత్రికి పంపారు.