ఫేమ్ కోసం ఫేక్ అరెస్ట్.. తిక్క కుదిర్చిన ముంబై పోలీసులు

ఫేమ్ కోసం ఫేక్ అరెస్ట్.. తిక్క కుదిర్చిన ముంబై పోలీసులు

బాలీవుడ్ ప్రేక్షకులకు ఉర్ఫీ జావెద్‌(Urfi Javed) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. సినిమాల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. చిత్రవిచిత్రమైన డ్రెస్సులను ధరించి, ఆ ఫోటోలను  సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆమె చేసే రచ్చ అంతా.. ఇంతా కాదు. ఆ కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతూ ఉంటుంది ఉర్ఫీ. కొన్నిసార్లు ఆమె షేర్‌ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి షేర్ చేసి చిక్కుల్లో పడింది ఉర్ఫీ జావెద్‌. తనను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నట్లు ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఇద్దరు మహిళా పోలీసులు ఉర్ఫీని అరెస్ట్‌ చేస్తున్నట్లుగా ఉంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయింది. అది నిజమని నమ్మిన నెటిజన్స్..  చిన్న దుస్తులు వేసుకుంటే అరెస్ట్‌ చేస్తారా? అంటూ ముంబై పోలీసులను ట్రోల్‌ చేశారు.

ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఉర్ఫీ షేర్ చేసిన ఆ వీడియో ఫేక్ అని తెలిసింది. ఫేమ్ కోసం ఉర్ఫీనే ఆ వీడియోను చేయించారట. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టగా.. అది ఫేక్ వీడియో అని తేలింది. ఈ విషయాన్నీ సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు.. ఉర్ఫీతోపాటు.. ఆ వీడియోలో నటించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ.. వారిపై ఐపీసీ సెక్షన్స్ 171, 419, 500, 34 కింద కేసు నమోదు చేశారు.

ALSO READ :- Super Food : పల్లీలు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఇది తెలిస్తే రోజూ తింటారు