భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చు : కేరళ హైకోర్టు

భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చు : కేరళ హైకోర్టు

ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక పై ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవాలనుకుంటే.. భర్త అంగీకారం అవసరం లేదని కేరళ హైకోర్టు తెలిపింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరే హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని వెల్లడించింది. భర్త అంగీకారం లేకున్నా ఆ మహిళ విడాకుల కోసం ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళలకు భర్త నుంచి భరణం ఇవ్వాలని కూడా కోర్టు చెప్పింది.

జస్టిస్ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ డయాస్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పు ఇచ్చింది. భ‌ర్త అంగీకారం లేకపోయినా కుల విధానాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చని కోర్టు ఈ తీర్పులో తెలిపింది. ఈమేరకు 59 పేజీల తీర్పును ధ‌ర్మాస‌నం వినిపించింది. ముస్లిం మ‌హిళ ఎప్పుడైనా త‌న వివాహ బంధాన్ని రద్దు చేసుకోవచ్చని.. ప‌విత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీక‌రిస్తుంద‌ని కోర్టు తెలిపింది.