కొల్లాపూర్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ ఆఫీస్లో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా శుభ్రం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్‌ను మంత్రి తనిఖీ చేసి, వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఆర్డీవో ఆఫీస్‌కు ఫైళ్లు పంపించడంలో జాప్యం చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆఫీస్ ను పరిశీలించారు.
ఈక్రమంలో టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు పోసి టాయిలెట్లను శుభ్రం చేశారు. ఆఫీస్ నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియను పరిశీలించి, లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి మాట్లాడారు.
