రేపట్నుంచే సుందర్ సందడి

రేపట్నుంచే సుందర్ సందడి

ఇటీవలే ‘శ్యామ్‌‌‌‌‌‌‌‌ సింగరాయ్’గా వచ్చి మెప్పించిన నాని.. త్వరలోనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్  సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇవ్వడానికి టీమ్ ప్లాన్ చేసింది. నాని పోషిస్తున్న కేపీవీఎస్ఎస్‌‌‌‌‌‌‌‌పీఆర్ సుందర ప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాత్రని పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది.  కొత్త ఏడాదిలో సుందర్ సందడి స్టార్ట్ చేస్తున్నామంటూ నాని ట్వీట్ చేశాడు. తన సరసన ‘రాజా రాణి’ ఫేమ్ నజ్రియా హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. దీంతోపాటు ‘దసరా’ అనే మూవీ కూడా చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్.