- నారాయణపేట కలెక్టర్ ప్రియాంక
మరికల్, వెలుగు : మరికల్ మండల కేంద్రంలోని గురుకుల బాలికల కళాశాలలో రూ. 43 లక్షలతో చేపట్టిన రిపేర్లను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, శానిటేషన్, ఎలక్ట్రికల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్ల రిపేర్లు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
వాటర్ ట్యాంక్ నీరు వృథా కాకుండా వాల్వ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ధరలు గిట్టుబాటు కాక ప్రస్తుత వంట ఏజెన్సీ తప్పుకుంటామని చెబుతున్న నేపథ్యంలో, తక్షణమే కొత్త ఏజెన్సీకి లేదా మహిళా సంఘాలకు వంట బాధ్యతలు అప్పగించాలని ఎంపీడీవోను ఆదేశించారు.
