ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్రు : పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్రు : పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

నెక్కొండ, వెలుగు : పంట నష్టపరిహారం విషయంలో కాంగ్రెస్‌‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌‌ జిల్లా నెక్కొండ ఎంపీడీవో ఆఫీస్‌‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గానికి రూ.42 కోట్ల పరిహారం చెక్కులు తీసుకొచ్చానని చెప్పారు. నష్టపరిహారం అందని రైతులకు పనిముట్ల పంపిణీలో ప్రయారిటీ ఇస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బర్త్ డే విషెస్

నెక్కొండ పట్టణంలో సెంట్రల్‌‌ లైటింగ్‌‌, నెక్కొండ, నర్సంపేట బీటీ రోడ్డు పనులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. సీజనల్‌‌ వ్యాధుల పట్ల మెడికల్‌‌ ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్‌‌, జడ్పీటీసీ సరోజన, ప్రెసిడెంట్‌‌ సూరయ్య, సొసైటీ చైర్మన్‌‌ రాము, ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మెడికల్‌‌ కాలేజీకి రూ.183 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.