నక్షత్రమండలం చేరిన వోయేజర్​2 

నక్షత్రమండలం చేరిన వోయేజర్​2 

వోయేజర్​2 సౌరమండలాన్ని దాటేసి నక్షత్ర మండలంలోకి వెళ్లింది. తన సిస్టర్‌‌ స్పేస్‌‌క్రాఫ్ట్‌‌ వోయేజర్‌‌1ను అనుసరించింది. నిజానికి రెండు స్పేస్​క్రాఫ్ట్​లను కొద్ది రోజుల తేడాతోనే పంపించింది నాసా. వోయేజర్​1ను 1977 సెప్టెంబర్​ 5న ప్రయోగిస్తే, వోయేజర్​2ను దాని కన్నా ముందే అంటే 1977 ఆగస్టు 20న ప్రయోగించింది. దీన్నే ముందు ప్రయోగించినా, నక్షత్ర మండలంలోకి మాత్రం లేటుగా అడుగుపెట్టింది. 2018 నవంబర్​ 5న వోయేజర్​2.. నక్షత్ర మండలంలోకి చేరిందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ లోవా సైంటిస్టులు నిర్ధారించారు. ‘‘వోయేజర్​2 నక్షత్రమండలంలోకి వెళ్లేటప్పుడు సౌర గాలులు దానిపై పెద్ద ప్రభావాన్నే చూపించాయి. గతంలో వోయేజర్​1కూ అదే జరిగింది. కానీ, ప్లాస్మా, హీలియోస్ఫియర్​ను దాటుకుని ఆ రెండు నక్షత్ర మండలంలోకి అడుగు పెట్టడం అద్భుతమే” అని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రయోగించిన 42 ఏళ్లకు వోయేజర్​2 నక్షత్రమండలాన్ని దాటింది. దాని ప్రయాణంలో భాగంగా ప్లాస్మా, చార్జ్​డ్​ పార్టికల్స్​, గ్యాస్​లో మార్పులను స్పేస్​క్రాఫ్ట్​ కనిపెట్టిందని సైంటిస్టులు చెబుతున్నారు. సౌర మండలాన్ని దాటే క్రమంలో నక్షత్ర మండలానికి సమీపంలో ప్లాస్మా సాంద్రత పెరిగినట్టు వోయేజర్​2 పరికరాలు గుర్తించాయన్నారు. సూర్యుడికి రక్షణ కవచంలా ఉండే హీలియోస్ఫియర్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు.