నాసాకు కూడా తప్పలేదు పైసల పరేషాన్?

నాసాకు కూడా తప్పలేదు పైసల పరేషాన్?
  • మూన్ ల్యాండర్​కు రూ.9,957 కోట్లడిగిన నాసా
  • రూ.4267 కోట్లే ఇస్తామన్న సర్కార్​  

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. పైసల కోసం పరేషాన్ అయితున్నది. ఒకవైపేమో భారీ మిషన్ లు చేపట్టాలంటూ టార్గెట్ పెడుతున్న సర్కారు.. అందుకు తగ్గ ఫండ్స్ విషయంలో మాత్రం కొర్రీలు వేస్తోందంటూ గుస్సా అయిపోతున్నది. చంద్రుడిపై మళ్లీ మనుషులను దింపాలన్నా, మూన్ రీసెర్చ్​ను ముందుకు తీసుకుపోవాలన్నా, అనుకున్న సమయానికే మిషన్ స్టార్ట్ కావాలన్నా ఎక్స్ ట్రా ఫండ్స్ కావాల్సిందేనని స్పష్టం చేస్తోంది.

అంతేకాదు.. ఆర్టిమిస్ పేరుతో చేపట్టనున్న మూన్ మిషన్​లోని కీలక అంశాలను వివరిస్తూ, సర్కారును ఒకింత ధిక్కరించేలా ఉన్న ఒక వీడియోను సైతం నాసా విడుదల చేసినట్టు ‘స్పేస్ పాలసీ ఆన్ లైన్’ అనలిస్టులు వెల్లడించారు. చంద్రుడిపైకి మరోసారి మనుషులను పంపేందుకు చేపట్టిన ఆర్టిమిస్ కోసం 2,260 కోట్ల డాలర్ల (రూ.1.60 లక్షల కోట్లు) ఫండ్స్​ను అమెరికా ప్రకటించింది. అయితే, ఈ మిషన్ ను 2028లో లాంచ్ చేయాల్సి ఉండగా, డెడ్ లైన్​ను ప్రభుత్వం నాలుగేళ్లు కుదించింది.

2024లోనే మిషన్​ చేపట్టాలని టార్గెట్​ పెట్టింది. ఆ మేరకు ఎక్స్ ట్రా ఫండ్స్ కావాలని ప్రపోజల్స్ పెట్టింది నాసా. ముఖ్యంగా చంద్రుడిపై ఆస్ట్రోనాట్లను సేఫ్​గా దించేందుకు, అనేక పరికరాలను తీసుకెళ్లేందుకు ప్రపంచంలోనే అధునాతన ల్యాండర్ కావాలని, దానికోసం140 కోట్ల డాలర్లు (రూ.9,957 కోట్లు) కావాలని కోరింది. అయితే, ల్యాండర్ కు 60 కోట్ల డాలర్లు (రూ. 4,267 కోట్లు) మాత్రమే కేటాయించేందుకు హౌజ్ ఆఫ్​రిప్రజెంటేటివ్స్, సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీలు ఆమోదం తెలిపాయి.