Rashmika Mandanna: రష్మిక మందన్నకు అరుదైన గౌరవం..ఫోర్బ్స్ జాబితాలో చోటు

Rashmika Mandanna: రష్మిక మందన్నకు అరుదైన గౌరవం..ఫోర్బ్స్ జాబితాలో చోటు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి..ఇపుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న అని చెప్పుకోవాలి.

లేటెస్ట్గా రష్మిక మరో అరుదైన ఘనత సంపాదించుకుంది. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్(Forbes) ఇండియా జాబితాలో చోటు సంపాదించింది. యంగ్ డిస్ట్రప్టర్స్, ట్రైల్‌బ్లేజర్స్ కేటగిరిలో ఈ భామ చోటు దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. అంటే ప్రస్తుతం ఇండియాలో టాప్ పొజిషన్కి ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ని ప్రచురించింది.

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్లో యంగ్ టాలెంట్స్తో కలిసి కవర్ పేజీపై స్టిల్ ఇచ్చిన తన ఫోటోని పోస్ట్ చేసింది. ఎంతో కృతజ్ఞత అంటూ ట్యాగ్ ఇచ్చింది.ఈ పోస్టు చూసిన నెటిజెన్స్, ఆమె ఫ్యాన్స్ స్పెషల్ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 రష్మిక మందన్న టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి భారీ మొత్తంలో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. తన క్యూట్ ఎకస్ప్రేషన్స్తో, మెస్మరైజింగ్ లుక్స్తో ఆడియన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అంతేకాదు ఇంస్టాగ్రామ్లో 40 మిలియన్ల ఫాలోవర్ల మైలు రాయిని దాటేసి సౌత్ హీరోయిన్స్‌లో లిస్ట్లో రికార్డు కూడా నమోదు చేసుకుంది. 

ఇక రీసెంట్ రష్మిక నటించిన యానిమల్(Animal) సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది.ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. గీతాంజలి పాత్రలో ఆమె నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమా తరువాత హిందీలో చావా, తమిళం లో ధనుష్ సినిమా, ది గర్ల్ ఫ్రెండ్, సినిమాలు చేస్తోంది.