జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’

మహానటి సినిమాకు జాతీయ పురస్కారం దక్కింది. ఇప్పటివరకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కించుకొంది. శుక్రవారం ఢిల్లీలో  66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో ‘మహానటి’ చిత్రానికి మూడు అవార్డులు వచ్చాయి. ఒకటి ఉత్తమ తెలుగు చిత్రం కాగా, రెండవది ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హీరోయిన్ ‘కీర్తీ సురేశ్’ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. మరో అవార్డు బెస్ట్ కాస్ట్యూమ్ విభాగంలో వచ్చింది. ‘మహానటి’తో  పాటు మరో మూడు తెలుగు సినిమాలు రంగస్థలం(బెస్ట్ మిక్స్ డ్ ట్రాక్), చి.ల.సౌ(బెస్ట్ ఒరిజనల్ స్ర్ర్కీన్ ప్లే), ఆ  (బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్, బెస్ట్ మేకప్ అర్టిస్ట్) లకు కూడా  అవార్డులు దక్కాయి.

అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్ర పోషించారు.గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.

మిగతా అవార్డులు..

బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూస్:  ప్యాడ్ మ్యాన్

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్:  సురేఖ సిక్రి (బధాయి హో)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : స్వానంద్ కిర్కిరే (చుంబక్)

బెస్ట్ యాక్టర్:  ఆయుష్మాన్ ఖురానా (అంధాదున్), విక్కీ కౌశల్ (యురి)

బెస్ట్ యాక్ట్రెస్ : కీర్తి సురేశ్ (మహానటి)

బెస్ట్ డైరెక్షన్:   ఆదిత్య ధార్ (యురి)

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: హెల్లారే (గుజరాతీ)

బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్: సర్కారీ.హి.ప్రా షాలే కాసరగోడు, కొడుగె

బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్ మెంట్:  పానీ

బెస్ట్ కొరియోగ్రఫీ : పద్మావత్(ఘూమర్)

బెస్ట మ్యాజిక్ డైరెక్టర్ : పద్మావత్

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ : ఆ, కేజీఎఫ్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ : సంజయ్ లీలా భన్సాలీ, పద్మావత్

బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : యురి

బెస్ట్ మేకప్ అర్టిస్ట్ : రంజిత్( ఆ)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : రాజశ్రీ పట్నాయక్, వరుణ్ షా, అర్చనా రావ్(మహానటి)

బెస్ట్ యాక్షన్ మూవీ : కేజీఎఫ్

బెస్ట్ లిరిక్స్ : మంజుత ( నాతి చరామి)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : కమ్మర సంభవం (మళయాళం)

బెస్ట్ ఎడిటింగ్ : నాతిచరామి(కన్నడ)

బెస్ట్ లోకేషన్ సౌండ్: తెండ్ల్యా

బెస్ట్ సౌండ్ డిజైన్: యురి

బెస్ట్ మిక్స్ డ్ ట్రాక్ : రంగస్థలం

బెస్ట్ ఒరిజనల్ స్ర్కీన్ ప్లే : చి.ల.సౌ

బెస్ట్ అడాప్టడ్ స్ర్కీన్ ప్లే: అంధాదున్

బెస్ట్ డైలాగ్ : తారీఖ్

బెస్ట్ సినిమాటోగ్రఫీ : ఒలు (మలయాళం)

బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్: బిందు మణి (మాయావి మనవే..(నాతిచరామి))

బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్:  ఆర్జిత్ సింగ్ ( బింతే దిల్.. (పద్మావత్))

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్స్ : పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా (కన్నడ)