
ఎన్నికల వేళ.. మేఘాలయలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారికి జేపీ నడ్డా కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనుభవజ్ఞుల చేరికతో పార్టీ మరింత బలంగా మారిందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు ఎన్నడూలేనంత అభివృద్ధి సాధించాయన్నారు. మేఘాలయాతో పాటు.. త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధిస్తామన్నారు.