ఉక్రెయిన్కు అండగా పోలండ్ చేరుకున్న నాటో దళాలు

ఉక్రెయిన్కు అండగా పోలండ్ చేరుకున్న నాటో దళాలు

రష్యా ముప్పేట దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు అండగా నాటో దళాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సాయం కోరిన తర్వాత రోమేనియా, పోలాండ్, జర్మనీ, గ్రీస్ లో మరో 500 మంది బలగాలు మోహరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇప్పటికే 40 వేల మంది సైనికులు, ఫ్రాన్స్ రఫెల్ విమానాలు, నాలుగు ఫైటర్ జెట్లు పోలాండ్ కు చేరుకున్నాయి. నాటో దేశాల ఎంట్రీతో ఉక్రెయిన్ బలం పెరిగింది.  అయితే నాటో దేశాల చర్యలు పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తోందని హెచ్చరించాడు. ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తే.. తమ ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దేశం విడిచి పారిపోయారన్న వార్తలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించారు. తాను రాజధానిలోనే ఉన్నానని ప్రకటించారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే యుద్ధం గెలుస్తున్నామంటూ వీడియో సందేశం ఇచ్చారు జెలెన్ స్కీ.

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళనాడు యువకుడు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

బెలూన్స్​తో మోడలింగ్​ ఛాన్స్