Inspector Rishi: నాకు పెళ్లయింది..మళ్ళీ నిన్ను చేసుకోలేను..నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్

Inspector Rishi: నాకు పెళ్లయింది..మళ్ళీ నిన్ను చేసుకోలేను..నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్

నవీన్ చంద్ర లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. నందిని జె.ఎస్ దర్శకత్వంలో  సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల (మార్చి 29) నుంచి అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడియన్స్ లో హైప్ పెంచేసింది.సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. 

తాజాగా ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సీరీస్ మేకర్స్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: దీప్తి ప్రాణం తనలోనే ఉందట.. ఈ లేటెస్ట్ పోస్ట్ ఎవరికోసమో!

"ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా హరర్ సినిమాలను ఎక్కువ టచ్ చేయలేదు. ఈ సినిమాలో హారర్ తో పాటు థ్రిల్లర్, మంచి క్యారెక్టర్స్ తో కూడుకున్న థ్రిల్లింగ్ ఫిల్మ్ ఇది. ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్ లోనూ డిఫెరెంట్  లేయర్స్ ఉన్నాయి. ఈ సిరీస్ కోసం చాలా మంది దాదాపు 100 రోజులు వర్క్ చేశాం. అలా రోజూ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని దెయ్యం డైరెక్ట్ గా నా బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది.

ఎందుకంటే నాకు దెయ్యానికి ఇందులో చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఎందుకమ్మా వచ్చావు. ఆల్రెడీ నాకు పెళ్లయింది. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇలా ప్రతిరోజు అంటే 98 డేస్ ఇలానే వచ్చేది. ఆ దెయ్యం ప్రతిరోజు నన్ను ప్రేమించేది. కానీ, అదేదో నా బెడ్ రూమ్ లో ఉన్నప్పుడే వచ్చేది. ఏమో తెలియదు. అలాగే ఈ సీరీస్ మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అందరూ చూసి థ్రిల్ అవుతారని కోరుకుంటున్నానన్నారు'.