సిద్ధూ సోదరికి ఆయన భార్య కౌంటర్

సిద్ధూ సోదరికి ఆయన భార్య కౌంటర్

అమృత్ సర్: నవ్ జోత్ సింగ్ సిద్ధూకు ఇద్దరు  సిస్టర్స్ ఉన్న విషయం తనకు తెలియదని ఆయన భార్య నవ్ జోత్ కౌర్ సిద్ధూ తెలిపారు. సిద్ధూ తన తల్లిని సరిగ్గా పట్టించుకోలేదని, ఆస్తి కోసం ఇంటి నుంచి గెంటేశాడని ఆయన సోదరి సుమన్ తూర్ చేసిన ఆరోపణలకు నవ్ జోత్ కౌర్ పైవిధంగా స్పందించారు. సుమన్ తూర్ వివాదం గురించి ఓ జర్నలిస్టు అడగ్గా.. ఆమె ఎవరో నాకు తెలియదని నవ్ జోత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. అయితే సిద్ధూ తండ్రి మొదటి భార్యకు ఇద్దరు కూతుర్లు ఉన్నారనే విషయం తెలుసన్నారు.

కాగా, పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూపై మరో వివాదం నెలకొంది. సిద్ధూ తమ తల్లిని సరిగ్గా పట్టించుకోలేదని ఆయన సోదరి, ఎన్ఆర్ఐ సుమన్ తూర్ ఆరోపించారు. సిద్ధూ క్రూరమైన వ్యక్తి అని.. 1986లో తండ్రి చనిపోయిన వెంటనే తల్లిని ఇంట్లో నుంచి గెంటివేశాడని పేర్కొన్నారు. దీంతో ఆమె 1989లో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో నిస్సహాయ స్థితిలో మృతి చెందిందని సుమన్ చెప్పుకొచ్చారు. చండీగఢ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు. సిద్ధూపై ఆరోపణలను రుజువు చేసేందుకు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 'ఆస్తి కోసం అమ్మతో, నాతో సంబంధాలను సిద్ధూ తెంచుకున్నాడు. నేనెప్పుడూ ఆయన నుంచి డబ్బులను కోరుకోలేదు. ఆస్తిని దక్కించుకునేందుకు నన్ను, అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు. మమ్మల్ని ఆయన పట్టించుకోవడం లేదు' అని సుమన్ తూర్ చెప్పారు. తనకు రెండేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారని సిద్ధూ గతంలో అన్నారని.. ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు.

మరిన్ని వార్తల కోసం:

సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మితే రైతులకు బెనిఫిట్

సిద్ధూ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు

తల్లినే చూసుకోని సిద్దూ ప్రజలను పట్టించుకుంటాడా?