
శాండిల్‌వుడ్‌లో పలు సూపర్ హిట్స్ అందుకున్న కన్నడ స్టార్ దునియా విజయ్.. ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రంలో విలన్ పాత్రకు అతడిని తీసుకున్నారు. గోపీచంద్ మలినేని తన సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేస్తాడు. ఆయన లాస్ట్ మూవీ రవితేజ ‘క్రాక్’లోనూ సముద్రఖనిని బలమైన పాత్రలో చూపించాడు. ఇందులో కూడా దునియా విజయ్‌ను పవర్‌ఫుల్ రోల్‌లో చూపించనున్నాడట. బాలకృష్ణ, విజయ్‌ల మధ్య ఫైట్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నా యని అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్ర్కిప్ట్ రెడీ చేసిన గోపీచంద్, ఇందులో బాలయ్యను మునుపెన్నడూ చూడని లుక్‌లో ప్రెజెంట్ చేస్తానని చెబుతున్నాడు. శ్రుతిహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేయనున్నారు.