ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు

ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో  37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో  35 మంది మరణించారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసల సంఖ్య 9 లక్షల 76 వేల 987 కు చేరాయి. నిన్న ఒక్కరోజే 3,116 మంది కరోనా నుంచి కొలుకున్నారు. దీంతో మొత్తం  ఇప్పటి వరకు 9 లక్షల 15వేల 626 మంది  డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 53,889 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో కోటి 57లక్షల 53 వేల 679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.