
- జారీ చేసిన డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా లాక్‌డౌన్ అయింది. అయితే లాక్‌డౌన్ విదించినంత ఈజీగా తీసేయలేం అని అంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో). లాక్‌డౌన్ ఎత్తేయాలంటే ఆరు అంశాలు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, అప్పుడే లాక్‌డౌన్ ఎత్తేయడం సేఫ్ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడ్హానమ్ గెబ్రియాసిస్ అన్నారు. ఇది హెల్త్ క్రైసిస్ కంటే డేంజర్ అని ఆయన అభిప్రయాపడ్డారు. వ్యూహాత్మకంగా లాక్‌డౌన్ ఎత్తేయాలని, దాని కోసం కచ్చితంగా ఆరు మార్గదర్శకాలు పాటించాలని అన్నారు. మూడు నెలల్లో కరోనా వ్యాప్తి, వ్యాధి తీవ్రత, దానికి ట్రీట్‌మెంట్ ఇస్తున్న విధానం, ఎలా ఆపాలి అనే దానిపై సేకరించిన ఆధారాలతో ఈ సూచనలు చేసినట్లు టెడ్రోస్ చెప్పారు.
డబ్లూహెచ్‌వో సూచించిన ఆరు సూత్రాలు
= వైరస్ వ్యాప్తి పరిమితంగా ఉండాలి.
= ప్రయాణికుల ద్వారా వచ్చే కొత్త కేసులను హెల్త్ అధికారులు గుర్తించగలగాలి.
= అనుమానస్పద కేసులను గుర్తించి పరీక్షించాలి. పాజిటివ్ వచ్చిన కేసులను సమర్థంగా వేరుచేసి, వారితో కాంటాక్ట్‌తో ఉన్నవారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచగలగాలి.
= గుంపులుగా తిరిగే ప్రదేశాల్లో, నర్సింగ్ హోమ్స్ లాంటి ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించగలగాలి.
= ఆఫీసుల్లో సోషల్ డిస్టెంసింగ్, హ్యాండ్ వాష్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
= వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలు పాటించాలి. కరోనా ప్రబలకుండా అపేందుకు కట్టుబడి ఉండాలి.