కొత్త ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌‌కు అండగా ఉంటాం

కొత్త ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌‌కు అండగా ఉంటాం

న్యూఢిల్లీ: కరోనా వల్ల దెబ్బతిన్న దేశ ఎకానమీని తిరిగి పరిపుష్టం చేసే చర్యలకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ అన్నారు. కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే స్టార్టప్, ఫిన్‌‌టెక్‌లు ఫైనాన్షియల్ ప్రాడక్ట్‌‌లను తయారు చేయడంపై దృష్టిసారిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌‌‌‌లో బడ్జెట్‌‌ అమలు గురించి నిర్వహించిన వెబినార్‌‌లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘కొత్త ఎంటర్‌‌ప్రెన్యూర్స్‌‌కు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా చూడటం చాలా కీలకం. మన దేశ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి క్రెడిట్ ఫ్లోకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని బిజినెస్ వెంచర్లు కూడా సక్సెస్‌ఫుల్ కాలేవు. ఏ రంగంలోనైనా ఒడిదొడుకులు మామూలే. అయితే సరైన సమయంలో, సదుద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విజయాలు సాధించడం సులువే’ అని మోడీ పేర్కొన్నారు.