యూట్యూబ్​ కొత్త సీఈఓ నీల్​ మోహన్

యూట్యూబ్​ కొత్త సీఈఓ నీల్​ మోహన్

యూట్యూబ్​ కొత్త సీఈఓ నీల్​ మోహన్

న్యూఢిల్లీ : వీడియో షేరింగ్​ ప్లాట్​ఫామ్​ యూట్యూబ్​ సీఈఓగా నీల్​మోహన్​ అపాయింటయ్యారు. స్టాన్​ఫోర్డ్​లో గ్రాడ్యుయేషన్​ చేసిన ఈ ఇండియన్ ​2008 లో గూగుల్​లో జాయినయ్యారు. దీంతో గ్లోబల్​ కంపెనీలకు​ సీఈఓల జాబితాలో మరో భారతీయుడు చేరినట్లయింది.  ఇప్పటికే మైక్రోసాఫ్ట్​, గూగుల్​ సహా పెద్ద టెక్​ కంపెనీలకు 8 మంది భారతీయులు సీఈఓలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచీ యూట్యూబ్​ చీఫ్​ ప్రొడక్ట్​ ఆఫీసర్​గా నీల్​ మోహన్​ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్​  షార్ట్స్​, మ్యూజిక్​, సబ్​స్క్రిప్షన్​ ఆఫరింగ్స్​పై ఫోకస్​తో ఆయన పనిచేశారు. గూగుల్​లో జాయినవడానికి ముందు డబుల్​క్లిక్​ కంపెనీలో ఆరేళ్లపాటు నీల్​ మోహన్​ ఉద్యోగం చేశారు.