కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన భవజ్ఞ

కిక్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన భవజ్ఞ

సంగారెడ్డి(హత్నూర), వెలుగు : హత్నూర మండలంలోని గుండ్ల మాచనూర్ గ్రామానికి చెందిన నీరుడి భవజ్ఞ కిక్ బాక్సింగ్ జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కిక్ బాక్సింగ్ స్టేట్ జాయింట్ సెక్రెటరీ, సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ పోచయ్య తెలిపారు. ఈనెల 22 నుంచి 26 వరకు మహారాష్ట్ర, పూణే లోనిర్వహించిన జాతీయ స్థాయి చిల్డ్రన్ క్యాడేట్ నేషనల్ లెవెల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​2024 పోటీల్లో భవజ్ఞ పాల్గొన్నది. 

అండర్ 10 విభాగంలో పాయింట్ ఫైట్ లో గోల్డ్ మెడల్, మ్యూజికల్ పర్ఫామెన్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. హర్యానా, చత్తీస్ గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల క్రీడాకారులతో పోటీపడి విజయం సాధించింది. నీరుడు భవజ్ఞ చిన్న వయసులోనే జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ లో రాణించడం పట్ల కిక్ బాక్సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ప్రశంసించారు. కోచ్ లు వర్షిత, మహేశ్ గౌడ్ ఉన్నారు.