నెట్‌ఫ్లిక్స్‌ గేమ్స్ వచ్చేసినయ్‌!

నెట్‌ఫ్లిక్స్‌ గేమ్స్ వచ్చేసినయ్‌!
  • నెట్‌ఫ్లిక్స్‌ గేమ్స్ వచ్చేసినయ్‌!
  • అండ్రాయిడ్ డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం మాత్రమే
  • మరిన్ని గేమ్స్ తెస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: అండ్రాయిడ్‌‌‌‌‌‌‌‌‌‌ డివైజ్‌‌‌‌‌‌‌‌ల కోసం మొబైల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చింది. తన కస్టమర్లకు ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ఫ్రీగా అందిస్తోంది. మొదట ఐదు గేమ్‌‌‌‌‌‌‌‌లను అందుబాటులోకి తెచ్చింది. స్ట్రేంజర్ థింగ్స్‌‌‌‌‌‌‌‌ 1984 ,  స్ట్రేంజర్ థింగ్స్‌‌‌‌‌‌‌‌3: ది గేమ్‌‌‌‌‌‌‌‌, సూటింగ్ హూప్స్‌‌‌‌‌‌‌‌ , కార్డ్ బ్లాస్ట్‌‌‌‌‌‌‌‌, టీటెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌లను కంపెనీ లాంచ్ చేసింది. నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ (మొబైల్‌‌‌‌‌‌‌‌ వెర్షన్స్‌‌‌‌‌‌‌‌) ను లాంచ్‌‌‌‌‌‌‌‌ చేయడం ఆనందంగా ఉందని కంపెనీ ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఈ రోజు నుంచి ఐదు మొబైల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు ఆడుకోవచ్చని తెలిపింది. మరిన్ని గేమ్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నామని చెప్పింది. ఈ గేమ్స్ ఆడాలంటే యూజర్లకు నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ ఉండాలి. గేమ్స్‌‌‌‌‌‌‌‌ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఇన్‌‌‌‌‌‌‌‌ యాప్ పర్చేజ్‌‌‌‌‌‌‌‌లు కూడా చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ మొబైల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌ అండ్రాయిడ్ డివైజ్‌‌‌‌‌‌‌‌ల కోసం అందుబాటులో ఉన్నాయి. నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లోకి లాగిన్ అయ్యాక  గేమ్స్ కోసం సపరేట్‌‌‌‌‌‌‌‌గా ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేసి నచ్చిన గేమ్స్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు.  అండ్రాయిడ్ ట్యాబ్లెట్లను వాడే వారు గేమ్స్ హోమ్‌‌‌‌‌‌‌‌ పేజీలో కనిపిస్తాయి లేదా కేటగిరీస్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌డౌన్ మెనూలో గేమ్స్‌‌‌‌‌‌‌‌ను సెలెక్ట్ చేసి డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి కూడా ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌ ఆఫర్ చేస్తున్న అన్ని లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లలో ఈ మొబైల్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఒకవేళ యూజర్ ఎంచుకున్న లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లో గేమ్ కనిపించకపోతే డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌గా ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లో ఈ గేమ్స్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ‘పిల్లల సేఫ్టీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే కిడ్స్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌లో ఈ గేమ్స్ అందుబాటులో ఉండవు’ అని వివరించింది. 

గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ఇలా డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు..
 1) నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో లాగిన్ అవ్వాలి. సపరేట్‌‌‌‌‌‌‌‌గా గేమ్స్‌‌‌‌‌‌‌‌ ట్యాబ్‌‌‌‌‌‌‌‌ ఉంటే దాన్ని క్లిక్ చేసిన నచ్చిన గేమ్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయాలి. ఈ గేమ్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రీడైరెక్ట్‌‌‌‌‌‌‌‌ అవుతారు. 
2)  డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా గేమ్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసి ఆడుకోవచ్చు. కానీ, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 
3)  ఈ గేమ్స్ ఆడడానికి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిన పనిలేదు.