పాత సైకిలే.. కలుపు యంత్రం..! కూలీ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిలో సాగు

పాత సైకిలే.. కలుపు యంత్రం..! కూలీ ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిలో సాగు

జగిత్యాల, వెలుగు: సాగు ఖర్చులను తగ్గించేందుకు ఓ రైతు సరికొత్త ఆలోచన చేశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లికి చెందిన మహమ్మద్ సలీం తన ఎకరం భూమిలో కూరగాయలు పండిస్తాడు. కూలీ ఖర్చులు పెరిగిపోవడంతో  ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వినూత్న ఆలోచన చేశాడు. కూరగాయల సాగులో గుంటుక తీయడానికి కూలీలకు రూ. 5 వేలు, ఎడ్ల నాగలితో రూ.2 వేల వరకు ఖర్చు వస్తుంది. దీన్ని తగ్గించేదెలా అని ఆలోచించాడు. యూట్యూబ్‎లో సెర్చ్ చేశాడు. గుంటుక తీసేందుకు పాత సైకిల్ కు రూ. 500తో మరమ్మతులు చేసి కలుపు తీసే యంత్రంగా రూపొందించాడు. ఇక ఎలాంటి ఖర్చు లేకుండా కలుపు తీస్తున్నాడు. సాగు ఖర్చు తగ్గించుకోవడంపై స్థానిక రైతుల నుంచి ప్రసంశలు వస్తున్నాయి.