
- 10 రోజులకుపైగా వాహనదారుల వెయిటింగ్
- రూల్స్ మేరకు రెండు రోజుల్లో అయ్యే అవకాశం
- ఆర్టీఏ ఆఫీసుల్లోనే స్లాట్ కుదిస్తున్నారనే ఆరోపణలు
- సిబ్బంది కొరత, పని ఒత్తిడే కారణమంటున్న అధికారులు
“ ప్రైవేట్ ఎంప్లాయ్ సూర్యనారాయణ..తను కొనుగోలు చేసిన బైక్ రిజిస్ట్రేషన్‌కు సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. తను స్లాట్ బుక్ చేసుకుంటే 15 రోజులకు ఇచ్చారు. దీంతో తనకు లీవ్ దొరక్క ఇబ్బంది పడాల్సి వచ్చిందని వాపోయాడు.’’
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు వారం నుంచి 10 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జంట నగరాల్లోని ఆర్టీఏ ఆఫీసులు చుట్టూ ప్రతిరోజూ వాహనదారులు రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి ఉంది. ఎందుకు ఇలా అని... అధికారులను అడిగితే సిబ్బంది కొరత కారణమని చెబుతున్నారు. మరోవైపు పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్లాట్‌బుకింగ్ లను తగ్గిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీఏ రూల్స్ మేరకు వాహనం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రిజిస్ర్టేషన్చేసుకోవాలి.
సిటీలో రోజూ వేల సంఖ్యలో టూ, ఫోర్ వీలర్ వెహికల్ అమ్మకాలు నడుస్తుంటాయి. అందరికి తక్కువ సమయంలో రిజిస్ర్టేషన్అయ్యే చాన్స్ లేదు. దీంతో కొత్త వాహనదారులు తప్పనిసరిగా స్లాట్‌బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి కేటాయించిన రోజున వెహికల్ తీసుకెళ్లి రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడిది కొత్త వాహనదారులకు పరీక్షించేలా తయారైంది. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్లాట్ బుకింగ్స్ కుదిస్తున్న అధికారులు!
సిటీలోని11 ఆర్టీఏ ఆఫీసుల్లో వాహనాల రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. ఇందులో ఖైరతాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మలక్‌పేట, ఉప్పల్ఆర్టీఏ ఆఫీసుల్లో అధికంగా అవుతుంటాయి. దీంతో ఆయా ఆఫీసుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజువారీగా 200 నుంచి 250 వరకు, మరికొన్ని ప్రధాన ఆఫీసుల్లో 400 వరకు స్లాట్ బుకింగ్‌లు చేస్తుంటారు. ఇలా ఎక్కువ స్లాట్బుకింగ్జరిగే ఆఫీసుల్లో అధికారులు వాటిని కుదించినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్‌పేట, మేడ్చల్, ఉప్పల్వంటి ఆఫీసుల్లో ఎంత రద్దీ ఉన్నా రోజుకు 200 మించి స్లాట్బుక్చేయడం లేదని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఆయా ఆఫీసుల్లో రోజుకు 200 నుంచి 250 టూవీలర్లు, 100 నుంచి 150 ఫోర్ వీలర్లు (కార్లు) రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. స్లాట్‌బుకింగ్ చేసుకోగా వారం నుంచి 10 రోజుల సమయం ఇస్తున్నట్టు పేర్కొంటున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబంధిత కార్యాలయాల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో పాటు క్లరికల్గ్రేడ్సిబ్బంది ఉంటారు. వీరి ఆధ్వర్యంలో వాహన రిజిస్ట్రేషన్ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్పనులు జరుగుతాయి. ఆయా కార్యాలయాల్లో రోజూ పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు వస్తుండడంతో అధికారులు పనిభారం తగ్గించుకునేందుకు స్లాట్బుకింగ్లను తగ్గిస్తున్నట్టు సమాచారం.
దీని ప్రభావం వాహన దారులపై పడుతుంది. నాలుగైందు రోజుల్లో పూర్తయ్యే పనులు వారం పదిరోజులు అవుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 15 నుంచి 20 రోజులకు కూడా ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఏ కు అన్ని చార్జీలు చెల్లిస్తున్నా ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత కారణంగానే లేట్
గ్రేటర్ సిటీలోని ఆర్టీఏ ఆఫీసుల్లో స్టాఫ్ కొరత ఉందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. పదేళ్ల కిందట ఉన్న సిబ్బందితోనే ఇప్పటికీ పని చేయిస్తుండగా పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. పెరిగిన వాహనాలకు తగ్గట్టుగా స్టాఫ్లేదన్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట, మేడ్చల్, ఉప్పల్వంటి ఆఫీసుల్లో ఇద్దరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ఇన్స్పెక్టర్లు, అదనపు స్టాఫ్ కావాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెప్పారు. చాలామంది శనివారం రోజే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
దీంతో శనివారాల్లోనే ఎక్కువ స్లాట్ డిమాండ్ఉన్నా అందుబాటులో ఉండడం లేదని పలువురు వాహనదారులు అంటున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు చేసిన వెంటనే యజమాని వివరాలు, ఫొటోలు ఇతర పత్రాలను ఆర్టీఏ డేటాబేస్‌లో ఎంట్రీ చేస్తారు. స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ తేదీని కూడా వెల్లడిస్తారు. ఆరోజు వినియోగ దారుడి పత్రాలను వెరిఫై చేసి, డాక్యుమెంట్లు, ఆర్ సీ కార్డు డెలివరీ చేస్తారు. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్జరిగేలా చేసిన ప్రతిపాదనలు ఉండగా అమలు కావడం లేదు.
వాహనం కొన్నవెంటనే అవసరమైన పత్రాలు, సిగ్నేచర్, ఆర్టీఏ ప్రాసెసింగ్అంతా షోరూంల్లోనే నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత వాహనదారుడు కేవలం నంబర్ ప్లేట్కోసమే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఈ ప్రతిపాదన జరిగింది. ఇప్పటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. స్లాట్ బుకింగ్ కు ఎక్కువ రోజులు ఎందుకు ఇస్తున్నారని ఓ ఉన్నతాధికారిని అడిగితే సమాధానం దాట వేశారు.
స్లాట్ బుకింగ్‌పై దుష్ప్రచారం..
ఆర్టీఏ పరిధిలోని కొన్ని కేంద్రాల్లో స్లాట్బుకింగ్లను కుదిస్తున్నట్టు వస్తున్న ప్రచారంలో నిజం లేదు. ఇది కేవలం దుష్పచారం మాత్రమే. అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో వచ్చిన అప్లికేషన్లకు స్లాట్ బుకింగ్ఇస్తున్నాం. ఆఫీసుల్లో అవసరమైన సిబ్బంది కూడా ఉన్నారు.
– పాండు రంగారావు, ఆర్టీఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్