
కరీంనగర్ టౌన్, వెలుగు: గత నెలలో సిటీలోని అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మెడికో హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్‌లో తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు శుక్రవారం కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో నిర్వహించిన వివిధ నైపుణ్య కార్యక్రమాల్లో అల్ఫోర్స్ స్టూడెంట్లు ట్రైనీ ఇన్ రెవెన్యూ మేనేజ్ మెంట్ ప్రాసెస్ అసోసియేట్స్‌గా ఎంపికవడం గొప్ప విషయమన్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టు చాలా అవసరమన్నారు. అకౌంటింగ్ అవసరమని వెల్లడించారు. కాలేజీలో అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఉద్యోగసాధనకు తోడ్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్,లెక్చరర్లు,స్టూడెంట్లు పాల్గొన్నారు.