నిర్భయ కేసు: ఉరిశిక్ష మరింత ఆలస్యం.?

నిర్భయ కేసు: ఉరిశిక్ష మరింత ఆలస్యం.?

నిర్భయ దోషుల ఉరి శిక్ష ఆలస్యం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దోషి ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్షను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపింది. ఆయన కేంద్ర హోంశాఖకు పంపారు. తమకు ముఖేష్ సింగ్ మెర్సీ పిటిషన్ అందిందని, అది పరిశీలనలో ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు క్షమాభిక్ష పెట్టుకున్న ముఖేష్ పిటిషన్ పై పటియాల హౌజ్ కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ ప్రిసన్ రూల్స్ 840, 863 ప్రకారం తీసుకునే చర్యలపై పూర్తి వివరంగా రేపటిలోగా రిపోర్ట్ ఇవ్వాలని తిహార్ జైలు అధికారులకు పటియాల హౌజ్ కోర్టు ఆదేశించింది. తన ఆర్డర్ పై రివ్యూ చేసుకునే అధికారం లేదని విచారణ సందర్భంగా తిహార్ జైలు న్యాయమూర్తి అన్నారు. మరోవైపు తిహార్ జైలు అధికారులు ఉరి శిక్ష అమలు షెడ్యూల్ పై ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు.