నిర్భయ దోషి మాస్టర్ ప్లాన్ : మరోసారి పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

నిర్భయ దోషి మాస్టర్ ప్లాన్ : మరోసారి పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

మార్చి 20న పడే ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా  చట్టంలోని లూప్‌ హోల్స్‌ని అడ్డం పెట్టుకుని ఉరి శిక్ష అమలును మరోసారి ఆలస్యం చేసేలా ఢిల్లీ హైకోర్ట్ ను ఆశ్రయించారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన అభ్యర్ధనను తిరస్కరించడంతో నిర్భయ దోషి వినయ్ శర్మ ఢిల్లీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దోషి వినయశర్మ, అతని తరుపు లాయర్ ఏపీ సింగ్ తో కలిసి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో రాష్ట్ర పతి తన అభ్యర్ధనను తిరస్కరించడం లో విధాన పరమైన, రాజ్యంగ పరమైన లోపాలు ఉన్నాయని  పేర్కొన్నారు.

అందుకు ఉదాహరణగా రాష్ట్రపతి తిరస్కరించిన తన క్షమాభిక్ష పిటిషన్ లో  ఢిల్లీ హోమంత్రి సత్యేంద్రజైన్ సంతకం లేదని నిర్భయ దోషి వినయ్ శర్మ, లాయర్ ఏపీ సింగ్ పిటిషన్ లో వివరించారు.