ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలను విస్మరించారని నిజామాబాద్‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌ విమర్శించారు. సీఎం హామీలపై ఎంపీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తుపాకీ రాముడి కోతలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. మూసీ, హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌లను కొబ్బరి నీళ్లలా మారుస్తానని మాయమాటలు చెప్పారన్నారు. తకు కొబ్బరి నీళ్లు అవసరం లేదని, అధికారంలోకి ఎనిదేళ్లయినా మామూలు నీళ్లగా కూడా మార్చలేకపోయారన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫాం హౌస్‌‌‌‌కే పరిమితమై వాస్తు పరిపాలనతో ప్రజలను మోసగించారని విమర్శించారు. 

టీచర్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలి

పిట్లం, వెలుగు: మండలం మేనూర్ మోడల్ స్కూళ్లలో స్టూడెంట్లను కొట్టిన టీచర్ మహేశ్వరిపై చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. బుధవారం క్లాస్‌‌‌‌లను బైకాట్ చేసి స్కూల్‌‌‌‌ ముందు రోడ్డుపై బైఠాయించారు.​ టీచర్, ప్రిన్సిపాల్‌‌‌‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పు చేసిన స్టూడెంట్​రెండు రోజులు టీచర్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పినా కక్షతో అందరిని కొట్టిందని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌‌‌‌ పక్క గదిలోనే ఉన్నా పట్టించుకోలేదని అన్నారు
. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.   

ప్లానింగ్‌‌‌‌తో చదివితే లక్ష్యం సాధించొచ్చు

కామారెడ్డి , వెలుగు: ప్లానింగ్‌‌‌‌తో చదివితే ఐఏఎస్, గ్రూప్స్​ఉద్యోగాలు సాధించ వచ్చని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్​ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కాలేజీలో  ఐఏఎస్​, గ్రూప్స్ ఉద్యోగాలపై అవగాహన  ప్రోగ్రామ్‌‌‌‌ జరిగింది. కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ..  సిలబస్‌‌‌‌పై అవగాహన పెంచుకుని నోట్స్‌‌‌‌ తయారు చేసుకుని ఎప్పటికప్పుడు చదివినట్లయితే  పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు. కాలేజీ డైరెక్టర్​ బాలాజీరావు, ప్రిన్సిపాల్ సాయిబాబు, లెక్చరర్లు పాల్గొన్నారు. 


పీహెచ్‌‌‌‌సీకి రూ.15 లక్షలతో రిపేర్లు

బోధన్, వెలుగు: మండలంలోని పెగడపల్లి పీహెచ్‌‌‌‌సీకి రూ.15 లక్షలతో మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు ఎంపీపీ బుద్దె సావిత్రి చెప్పారు. బుధవారం పెగడపల్లి పీహెచ్‌‌‌‌సీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ హాస్పిటల్‌‌‌‌కు వచ్చే రోగులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్​ బస్తీ దవాఖానలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే షుగర్, బీపీ పేషంట్లకు ఆశవర్కర్ల ద్వారా  ఇంటింటికీ మందులు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జి.శరత్, ​మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌ వి.ఆర్​దేశాయ్, వైస్ చైర్మన్‌‌‌‌ సాలూర షకీల్, సర్పంచ్‌‌‌‌లు చాకలి శంకర్, సాయరెడ్డి, వెంకట్‌‌‌‌రెడ్డి, ఎంపీటీసీ జయశ్రీ, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నర్సయ్య, పెంటకలాన్​ సొసైటీ చైర్మన్‌‌‌‌ రాజరెడ్డి, మెడికల్​ఆఫీసర్ మధుసూదన్, పంచాయతీరాజ్ ఏఈ సాయిలు, నాయకులు భూమారెడ్డి, మేడి రవి, సంజీవ్ పాల్గొన్నారు. 

టీయూ క్యాంపస్‌‌‌‌కు బస్ సర్వీస్ షురూ

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీకి బస్ సౌకర్యం కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న స్టూడెంట్లు, సిబ్బంది ఆశలు ఫలించాయి. ఆర్టీసీ బస్ సర్వీసులను ఆ సంస్థ చైర్మన్‌‌‌‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం క్యాంపస్‌‌‌‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ నుంచి నిజామాబాద్ వరకు రోజుకు మూడు సార్లు సిటీ మెట్రో బస్ నడుస్తుందన్నారు. ఇందుకు రూ.20 చార్జీ ఉంటుందన్నారు. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరుఫు నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రావాలని వీసీ రవీందర్ ఆహ్వానించగా ఎమ్మెల్సీ కవిత, తాను వస్తామని చెప్పారు. 

ఎల్లి గడ్డల సంచుల వెనుక పశువుల అక్రమ రవాణా

ఎడపల్లి, వెలుగు: ఎల్లి గడ్డల సంచుల వెనుక పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని బుధవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తాండే రావు కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఓ లారీలో పశువులను ఎక్కించి అవి కనిపించడకుండా ఎల్లి గడ్డ బస్తాలు లోడ్‌‌‌‌ చేసి నిజామాబాద్‌‌‌‌కు తరలిస్తున్నారు. జానకంపేట్‌‌‌‌ వద్ద పశువుల లారీని గమనించి కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని చెక్‌‌‌‌ చేశారు. దీంతో అక్రమ రవాణా విషయం బయపడింది. దాదాపు 48  పశువులను  కుక్కి రవాణా చేస్తున్న డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. లారీని పట్టుకున్న విషయం తెలియడంతో బీజేపీ నాయకులు పీఎస్‌‌‌‌కు తరలివచ్చి పశువులను పరిశీలించారు. అనంతరం వాటిని బోధన్ గోశాలకు తరలించారు.

మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌పై చర్య తీసుకోవాలి

ఆర్మూర్, వెలుగు: హరితహారంలో మొక్కలు నాటకుండానే  దొంగ లెక్కలు సృష్టించి లక్షల రూపాయల అవినీతికి పాల్పడిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌పై విచారణ చేయించాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించిన వారికి, నాన్  లే అవుట్ ప్లాట్లకు ఇంటి నంబర్లు కేటాయిస్తు కమిషనర్​ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డీజిల్‌‌‌‌కు రూ.9 లక్షలు బిల్లులు పెట్టి మున్సిపల్ ఆదాయం కాజేశారన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు కొంతం మంజుల, ఆకుల సంగీత, పాలెపు లత, సాయికుమార్ పాల్గొన్నారు.

మొక్కుబడిగా మండల మీటింగ్‌‌‌‌

లింగంపేట,వెలుగు: ప్రతి మూడు నెలలకోసారి జరిగే మండల జనరల్ బాడీ మీటింగ్‌‌‌‌కు ఎంపీటీసీలు, సర్పంచులు గైర్హాజరు కావడంతో వెలవెలబోయింది. లింగంపేట మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ గరీబున్నీసా అధ్యక్షతన స్థానిక రైతువేదిక భవనంలో నిర్వహించారు. సమావేశానికి 14 మంది ఎంపీటీసీ మెంబర్లకు గాను ఆరుగురు వచ్చారు. 41 మంది సర్పంచులకు కేవలం 12 మంది హాజరయ్యారు. దీంతో మండల సమావేశంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆయా ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు అభివృద్ధి పనులకు చెందిన నివేదికలను చదివి వినిపించి మీటింగ్‌‌‌‌ను మమ అనిపించారు. అనంతరం జడ్పీటీసీ ఏలేటి శ్రీలత మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి  మండల సర్వసభ్య సమావేశాలు వేదిక లాంటివన్నారు. మూడు నెలలకు ఓసారి జరిగే సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు హాజరై ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, తహసీల్దార్​ మారుతి, పీఆర్ డిప్యూటీ ఈఈ గిరి, ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.