క్షమాపణలు చెప్పనన్న బైడెన్

క్షమాపణలు చెప్పనన్న బైడెన్

ఆఫ్ఘనిస్థాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తాను చేసిన దానికి క్షమాపణలు చెప్పనన్నారు. అయితే తాలిబన్ల అసమర్థత కారణంగానే ఆప్ఘనిస్తాన్ లో జరిగిన సంఘటనలు చూసి తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. గత ఏడాది ఆగస్టులో కాబూల్ ఎయిర్ పోర్టులో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో అమాయకులైన 103 మంది మరణించగా..143 మందికిపైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.  2021 ఆగస్టు 31న అప్ఘనిస్తాన్ నుంచి  అమెరికా ..బలగాలను ఉప సంహరించుకుంది. దీంతో తీవ్రవాద తాలిబన్ అధికారంలోకి రావడంతో 20 ఏళ్ల యుద్ధానికి అగ్రరాజ్యం ముగింపు పలికింది. తాలిబన్ల అరాచక పాలనలో అమాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ నిధులు స్తంభింపజేయడంతో అనేకమంది ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే మహిళలు హక్కుల కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


మరిన్ని వార్తల కోసం
 

ఫిబ్రవరి 13వరకు కఠిన ఆంక్షలు

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు