జిన్నారం ఎంపీపీపై వీగిన అవిశ్వాసం

జిన్నారం ఎంపీపీపై వీగిన అవిశ్వాసం

జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ పై బీఆర్ఎస్​ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మంగళవారం ఆర్డీవో వసంత కుమారి మండల పరిషత్  కార్యాలయంలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అవిశ్వాసం పై సమావేశం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో అవిశ్వాసం వీగినట్లు ఆర్డీవో  వెల్లడించారు. జిన్నారం ఎంపీపీ గా కాంగ్రెస్​కు చెందిన రవీందర్ గౌడ్ కొనసాగనున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో అరుణ, అధికారులు పాల్గొన్నారు.