ఊరుకాని ఊరు.. బండ తిమ్మాపూర్ .. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా..!

ఊరుకాని ఊరు.. బండ తిమ్మాపూర్ .. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా..!

ఒక ప్రదేశాన్ని ఊరు అని పిలవాలంటే ఏమున్నా లేకపోయినా.. జనం మాత్రం కచ్చితంగా ఉండాలి. జనం లేకపోతే ఆ ప్రదేశాన్ని ఊరుగా పరిగణించలేం.... పిలవలేం.... కానీ.. అసలు మనుషులే లేకున్నా ఇక ప్రదేశానికి ఊరుగా పేరుంది. రెవెన్యూ విలేజ్ గా  కూడా పరిగణిస్తున్నారు. ఈ ఊరు కాని ఊరికి   ఒకప్రభుత్వ అధికారి కూడా ఉన్నాడు. ఆ ఊరు పేరు బండ తిమ్మాపూర్. అసలు ఇది ఎక్కడుంది. అక్కడ జనాలు ఎందుకు ఉండడం లేదు.  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలంలో ఉంది 'బండ తిమ్మాపూర్.   ఈ వింత ఊరు కనుమరుగై 70 ఏళ్లు గడుస్తున్నా.. దాని పేరు ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక్కడ మనుషులు లేరు. ఇళ్లు లేవు కానీ, ఊరికి పేరు మాత్రం ఉంది. రెవెన్యూ విలేజ్ గా కూడా కొనసాగుతోంది.

'బండ తిమ్మాపూర్' విస్తీర్ణం 866 ఎకరాలు.  అందులో 30 ఎకరాల ఆయకట్టు, 827 ఎకరాల మెట్ట ఉంది.ఆ భూమిని అయిజ,  ఎక్లాస్​ పూర్   గ్రామాలకు చెందిన 477 మంది రైతులు సాగు చేస్తున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. 1838లో మొదటగా గొర్లకాపరి తిమ్మప్ప అనేవ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న బండమీద ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆతర్వాత అన్ని కుల వృత్తుల వాళ్లు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దీనికి బండ తిమ్మాపూర్' అనే పేరు వచ్చింది. 

►ALSO READ | హైదరాబాద్ లో రోడ్డెక్కిన జొమాటో డెలివరీ బాయ్స్.. 14 గంటలు కష్టపడితే ఐదు వందలు కూడా రావట్లేదంట..

సుమారు వంద కుటుంబాలు ఇక్కడ ఉండేవి. తర్వాత కొన్నాళ్లకు నిజాం గవర్నమెంట్ దీన్ని రెవెన్యూ విలేజ్ గా గుర్తించింది. ఈ ఊరికి అనుకుని ఉన్న వాగు నీటిని వాడుకుని కొంత భూమిని సాగు చేసేవాళ్లు. ఆ వాగు ఇప్పటికీ పారుతుంది. మిగతా భూమిలో వర్షాధార పంటలు సాగుచేసేవాళ్లు. ఆ వాగు నీళ్లను వాడుకున్నందుకు రైతులు నిజాం గవర్నమెంట్ కు శిస్తు కట్టేవాళ్లు, కానీ కొన్ని కారణాల వల్ల 1945 నుంచి అగ్రామంలో ఎవరూ ఉండడంలేదు. అయినా, ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ గానే కొనసాగుతోంది. గతంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు ఉండేవి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన గద్యాల్​ సంస్థానాదీశులైన నల్ల సోమనాద్రి పూర్వీకుల శిల్పాలు. ఇప్పటికీ ఇక్కడున్నాయి.

అట్ల ఖాళీ అయ్యింది

బండ తిమ్మాపూర్ ప్రజలకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఏ చిన్న అవసరం వచ్చినా అయిజకు వెళ్లాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్లాలన్న వాగు దాటి వెళ్లాలి. అందుకే చాలామంది ఊరు విడిచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెరువు తవ్విస్తామని నవాబులు చెప్పడంతో మిగిలిన వాళ్లు కూడా అయిజ, ఎక్లాస్ పూర్ గ్రామాలకు వెళ్లిపోయారు. దాంతో తిమ్మాపూర్ పూర్తిగా ఖాళీ అయింది

మనుషులు లేకున్నా ఊరే

బండ తిమ్మాపూర్​ లో  మనుషులు లేకున్నా రెవెన్యూ గ్రామంగానే కొనసాగిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.  . బీ తిమ్మాపూర్ రైతులు అయిజ, ఎక్లాస్​ పూర్ గ్రామాల్లో ఉన్నారు. -దేవబండ దగ్గరలో  బండ తిమ్మాపూర్ ఉండేదని పూర్వీకులు చెబుతున్నారు,  ఆ ప్రదేశంలో  రోడ్డు పక్కకు గుళ్లు, విగ్రహలు ఉండేవి. చాలా కాలం వరకు అక్కడ  ఒక రోలు ఉండేవి. కానీ అవి ఇప్పుడు లేవు.  కొంతమందికి బండ తిమ్మాపూర్​ ఊళ్లో ఇప్పటికి భూమి ఉంది.  వారిని ఇప్పటికి  బండమీద తిమ్మాపూర్ రైతులు అనే పిలుస్తారు. ప్రస్తుతం ఆవూరికి సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగయ్యాయి..