
దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేశారనేలా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని సీబీఐ అధికారులు ఇండియాటుడేకి తెలిపారు.
సుశాంత్ హత్య చేయబడ్డారనే అంశంపై ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు కాబట్టి..ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తారని సమాచారం.
సీబీఐ అధికారులు ఇప్పటివరకు సుశాంత్ ఇంట్లో తనిఖీలు, ముంబై పోలీసులు సేకరించిన ఆధారాలు, రియా చక్రవర్తి ఆమె కుటుంబసభ్యుల్ని విచారించారు.
కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందానికి , ఫోరెన్సిక్ నివేదికలు, అనుమానితుల స్టేట్మెంట్ ప్రకారం సుశాంత్ ను హత్య చేశారనే ఆధారాలు వెలుగులోకి రాలేని ఇండియా టుడే కథనంలో పేర్కొంది.
సుశాంత్ ఆత్మహత్య కోణంపై సీబీఐ అధికారులు ఎక్కువ దృష్టి సారిస్తుండగా, హత్య దర్యాప్తును అధికారికంగా ఇంకా మూసివేయడం లేదని అధికారులు చెప్పారు.
విచారణలో తదుపరి అంశం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యొక్క పోస్ట్ మార్టం మరియు శవపరీక్ష నివేదికలపై ఆధారపడనుంది.