పంచాయతీ సిబ్బందికి జీతాలివ్వట్లే

పంచాయతీ సిబ్బందికి జీతాలివ్వట్లే
  • ఒక్కో జీపీలో రెండు నుంచి ఐదు  నెలల సాలరీ  పెండింగ్ లో
  • చెక్కులు డ్రా కాక మల్టీ పర్పస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కర్స్ కు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీతాలివ్వలేని దుస్థితి
  • సర్పంచ్, ఉపసర్పంచ్ ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్ పవర్.. సర్కార్ చేతుల్లో
  • ఎంపీడీఓల దగ్గరే డిజిటల్ కీస్
  • ట్రాక్టర్ ఈఎంఐలు కట్టేందుకూ అవస్థలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందికి నాలుగైదు నెలలుగా జీతాలందడం లేదు. చాలా పంచాయతీలను నిధుల కొరత వేధిస్తుండడం, నిధులున్న చోట జీపీ అకౌంట్ల ఫ్రీజింగ్ సమస్యతో  సర్పంచ్ లు వారికి సాలరీలు ఇవ్వలేకపోతున్నారు. చెక్కులు జనరేట్ చేసి ట్రెజరీలకు పంపితే క్లియర్ కావడం లేదని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులుగా, బిల్ కలెక్టర్లుగా, వాటర్ మన్ గా, స్ట్రీట్ లైట్ ఆపరేటర్లు, ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ తమ కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నెలనెలా జీతాలు రాకపోవడంతో తెలిసినవారి దగ్గర అప్పులు చేసి సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఒక్కో కార్మికుడికి కనీసం రెండు నెలల నుంచి ఐదు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. 

రెండు నెలల జీతం ఎప్పటికీ పెండింగ్ లోనే..

రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 36,500 మంది మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరిలో 90  శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. వారిలో బిల్ కలెక్టర్లు, కారోబార్లు, వాటర్ మెన్, స్ట్రీట్ లైట్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి జీతం రూ.8,500 ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోనే వీరి సాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం తరచూ జీపీ అకౌంట్లను ఫ్రీజింగ్ లో పెట్టడం, నిధుల మంజూరులో జాప్యం కారణంగా మల్టీ పర్పస్ వర్కర్స్ కు చెల్లించాల్సిన జీతాలను సర్పంచ్ లు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. చాలా పంచాయతీల్లో నాలుగైదు నెలలకోసారి రెండు, మూడు నెలల జీతమిచ్చి మరో రెండు నెలల జీతాన్ని పెండింగ్ లో పెడుతున్నారు. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్ నుంచి జీతాలు రాని పంచాయతీ కార్మికులు ఉండడం గమనార్హం.  

రూ.8500తో బతికెదెట్లా?

పెరిగిన ధరలతో పోలిస్తే తమకు వచ్చే జీతాలు సరిపోవడం లేదని, తమకు జీతాలు పెంచాలని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ చాలా కాలంగా కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీతాన్ని 2014, 2015, 2017, 2022 లో సర్కారు నాలుగుసార్లు పెంచినప్పటికీ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులను మాత్రం పట్టించుకోవడంలేదు. వీరికి చట్టబద్ధంగా అమలు చేయాల్సిన కనీస వేతన చట్టాన్ని వర్తింపజేయడం లేదు. వీరి జీతాలు పెంచితే గ్రామపంచాయతీలకు అధికంగా ఇవ్వాల్సి ఉంటుందనే జీతాలు పెంచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చెక్ పవర్ లేని ప్రజాప్రతినిధులుగా మిగిలినం: సర్పంచ్​లు

సెంట్రల్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుండటంతో కేంద్రం నేరుగా పైసలు జమచేసేందుకు సెపరేట్గా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్లు తీయించింది. ఈ అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సంతకాలతో డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ తయారుచేశారు. ఈ కీస్ ఇంకా ఎంపీడీఓలు, డీపీఓల వద్దే ఉన్నాయి. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు విడుదలైతే ఆ డిజిటల్ కీస్ ను ఉపయోగించి అధికారులు.. వాటిని కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులు, ఇతర బిల్లులకు మళ్లించారు. అకౌంట్లు ఖాళీ కావడంతో పంచాయతీ కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. డిజిటల్ కీస్ వచ్చాక చెక్ పవర్ లేని ప్రజాప్రతినిధులుగా మిగిలిపోయామని సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్థానిక సంస్థల అధికారాలను హరించడమేనని మండిపడుతున్నారు. 

జీతాలియ్యకుంటే ఇల్లు గడిచేదెట్లా ?  

నేను గ్రామపంచాయతీ సఫాయిగా పని చేస్తున్నా.  పొద్దున చలిలోనే లేచిపోయి వాడలన్నీ ఊకుతున్నాం. మోరీలు సాఫ్ చేస్తున్నాం. ఇంత పని చేస్తున్నా మాకు  ఐదు నెలల నుంచి జీతాలు రావడం లేదు. దీంతో భార్యాపిల్లలను పోషించుకోవడం ఇబ్బందిగా మారింది. రోజుకు ఎనిమిది గంటలు పని చేసినా మమ్మల్ని గుర్తించేటోళ్లు లేరు. మరి మేం ఎలా బతకాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాకు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి.

‑ కిన్నెర అంజయ్య, పోలంపల్లి, 
తిమ్మాపూర్, కరీంనగర్