Jr.Ntr: లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jr.Ntr: లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) లగ్జరీ కారు కొన్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 2న ఖైరతాబాద్ లోని ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు తారక్. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ కొన్న కారు విషయానికి వస్తే.. అది Mercedes-Benz Maybach S-Class S 580 అని తెలుస్తోంది. దీని మార్కెట్ ధర దాదాపు రూ.2.72 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఇక ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కాస్ట్లీ  కార్లు ఉన్నాయి. వాటిలో.. Lamborghini Urus, Range Rover Vogue, Porsche 718 Cayman, Mercedes-Benz GLS, BMW 7-Series మోడల్స్ ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ కారు కొన్న విషయం తెలిసి ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ALSO READ | Allu Arjun, Samantha: పదేళ్ళ తరువాత బన్నీతో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవే!

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అయాన స్టార్ డైరెక్టర్ కొరటాలతో దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.