ఈవీవీ గారికి..ఇది మా చిరు కానుక

ఈవీవీ గారికి..ఇది మా చిరు కానుక

వి.జె సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్స్‌‌‌‌.  శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు. దర్శకుడు కోదండ రామిరెడ్డి అతిథిగా హాజరై బెస్ట్ విషెస్  చెప్పారు. సప్తగిరి మాట్లాడుతూ ‘రైటర్‌‌‌‌‌‌‌‌గా సక్సెస్‌‌‌‌లు అందుకున్న రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగానూ సక్సెస్ అందుకుంటాడనే నమ్మకం ఉంది’ అన్నాడు. సన్నీ మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. నేను నమ్ముకున్న కళ నన్ను నిలబెడుతుంది అనుకుంటున్నా’ అని చెప్పాడు. 

రత్నబాబు మాట్లాడుతూ ‘సన్నీ, సప్తగిరి ఇద్దరూ బెస్ట్ యాక్టర్స్. సన్నీ డౌన్ టు ఎర్త్‌‌‌‌. ఘోస్ట్ రైటర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న నాకు సప్తగిరి లైఫ్‌‌‌‌ ఇచ్చాడు. రైటర్‌‌‌‌‌‌‌‌గా నేను నవ్వించిన ప్రతి సినిమా నాకు విజయాన్నిచ్చింది. ఇందులో కూడా అన్ లిమిటెడ్‌‌‌‌ ఫన్ ఉంటుంది.  ఈ సినిమా రిలీజైన అన్ని థియేటర్స్‌‌‌‌లో ఒక్క సీట్‌‌‌‌ను ఈవీవీ సత్యనారాయణ గారి కోసం ఉంచుతాం. మా టీమ్ ఆయనకు ఇస్తున్న చిరు కానుక ఇది’  అన్నారు. తనకి మంచి రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది అక్సా ఖాన్. ‘ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా సినిమా ఉంటుంది’ అని నిర్మాత రజిత్ రావు అన్నారు.