ఒకినావా కొత్త తయారీ యూనిట్

ఒకినావా కొత్త తయారీ యూనిట్

రూ.150 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్
కొత్త ప్రొడక్ట్‌‌‌‌లు లాంచ్ చేసేందుకు సన్నాహాలు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఒకినావా ఆటోటెక్ రాజస్తాన్‌‌‌‌లో కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టేందుకు రూ.150 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష యూనిట్లను అమ్మాలని ఈ కంపెనీ టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఈ టార్గెట్‌‌‌‌ను అందుకోవడానికి కొత్త ప్రొడక్ట్‌‌‌‌లను లాంచ్ చేయాలనుకుంటుంది. దీని కోసం కొత్త తయారీ యూనిట్‌‌‌‌ను పెడుతుంది. కంపెనీ ఇటీవలే బీ2బీ ఎలక్ట్రిక్ టూవీలర్‌‌‌‌‌‌‌‌ ఒకినావా డ్యూయల్‌‌‌‌ను లాంచ్ చేసింది. డెలివరీ సెక్టార్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌గా చేసుకుని రూ.58,998కి దీన్ని విడుదల చేసింది. మొత్తం సేల్స్‌‌‌‌లో ఈ సెగ్మెంట్‌‌‌‌ వాటా సుమారు 20 శాతంగా ఉంటుందని కంపెనీ అంచనావేస్తోంది. ‘మేము కొత్త ఫెసిలిటీతో, కొత్త ప్రొడక్ట్‌‌‌‌లతో వస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం’ అని ఒకినావా ఆటోటెక్ మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్ జీతేందర్ శర్మ అన్నారు.

కొత్త తయారీ యూనిట్‌‌‌‌ రాజస్తాన్‌‌‌‌లో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌‌‌‌కు దగ్గర్లోనే ఉంటుందని చెప్పారు. ఈ కొత్త ఫెసిలిటీ తొలి దశలో వార్షికంగా 5 నుంచి 6 లక్షల వెహికల్స్‌‌‌‌ను తయారు చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్‌‌‌‌లో ఈ యూనిట్ ద్వారా10 లక్షల వెహికల్స్‌‌‌‌ను తయారు చేయనున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి ఈ–కామర్స్, లాస్ట్ మైల్ డెలివరీలను పెంచింది. డెలివరీ సెగ్మెంట్‌‌‌‌లో ఇన్నొవేట్ ప్రొడక్ట్‌‌‌‌లను, తక్కువ నిర్వహణ ఖర్చు ఉన్న వెహికల్స్‌‌‌‌ను కోరుకుంటున్నారు. ఒకినావా డ్యూయల్ ద్వారా డెలివరీ అవసరాలను తీర్చుకోవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే ఓకేఐ100 కోడ్‌‌‌‌నేమ్‌‌‌‌తో హై స్పీడ్ మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్‌‌‌‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. 2017లో కంపెనీ ఆపరేషన్స్ ప్రారంభించినప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీ సేల్స్ లక్ష యూనిట్లుగా ఉండనున్నాయని ఒకినావా ఆటోటెక్ చెప్పింది.