
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత జమ్మూకాశ్మీర్ లోని పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో దాడులను నివారించ డానికి భద్రతా చర్యలను సమీక్షించ డంతో పాటు శాంతిభద్రతలను కాపాడటం, బాధితులకు న్యాయం జరిగేలా చూడటం వంటి అంశాల పైన డిస్కస్ చేసినట్టు సమాచారం.
పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఒమర్ అబ్దుల్లా, ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. భారత్, పాక్ మధ్య యుద్ధం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.