ఇండియాలో ఒమిక్రాన్ సబ్‎వేరియంట్ బీఏ2

ఇండియాలో ఒమిక్రాన్ సబ్‎వేరియంట్ బీఏ2

ఇండియాలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్‎వేరియంట్ బీఏ2 ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులను టెస్ట్ చేస్తే గతంలో వారిలో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ1 కనిపించేది. కానీ, ఇప్పుడు ఒమిక్రాన్ సబ్‎వేరియంట్ బీఏ2 ఎక్కువగా కనిపిస్తోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సీనియర్ అధికారి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశంలో మొత్తం కేసు లోడ్ ఇప్పటికీ 2 లక్షలకు పైగానే ఉందని అన్నారు. 11 రాష్ట్రాల్లో 50,000కు పైగానే కోవిడ్ 19 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 14 రాష్ట్రాల్లో 10,000 నుంచి 50,000 యాక్టివ్ కేసులు, ఇంకో 11 రాష్ట్రాల్లో 10,000 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. జనవరి 26 నాటికి, 551 జిల్లాలు 5% కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అన్నారాయన. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులలో అధిక సానుకూలత రేటు వచ్చింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, హర్యానా మరియు పశ్చిమ బెంగాల్‌లో రోజువారీ కేసుల లోడ్ స్థిరంగా తగ్గుముఖం పడుతోంది. కాగా.. పూణే, ఎర్నాకులం, నాగ్‌పూర్‌లను మంత్రిత్వ శాఖ ఆందోళన జిల్లాలుగా ఫ్లాగ్ చేసింది.
 

For More News..

తెలంగాణ కూడా ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి

67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు.. రైతులు మాత్రం బీమాకు అనర్హులా?

కరోనా వ్యాక్సిన్ల బహిరంగ అమ్మకానికి డీసీజీఐ అమోదం

సక్సెస్‎ఫుల్ వీర్యదాత.. 138 మందికి దానం