రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల విషెస్

రాష్ట్ర ప్రజలకు ప్రముఖుల విషెస్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్,  ప్రధాని మోడీ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  సంస్కృతి సంప్రదాయాలతో ప్రజలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, పారిశ్రామిక హబ్ గా మారిందని కొనియాడారు. ఇలాగే మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

 

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్టర్ వేదికగా తన విషెస్ అందించారు. తెలంగాణ ప్రజలు కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను అంటు ప్రధాని పేర్కొన్నారు.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షులు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అమర వీరుల త్యాగఫలితమే ప్రత్యేక రాష్ట్రమని కొనియాడారు.తెలంగాణ ప్రజలు తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ అర్థం చేసుకున్నారని, అందుకే ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. అయితే కేసీఆర్ హయాంల ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో పాలన గాడితప్పిందని మండిపడ్డారు. రైతులు, కార్మికులు, పేద ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషెస్ చెప్పారు. 

 

మరిన్ని వార్తల కోసం...

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గవర్నర్ గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా