మరోసారి తగ్గిన బంగారం..వెండి ధరలు

మరోసారి తగ్గిన బంగారం..వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ.100 తగ్గి, రూ. రూ. 54,950 కి చేరింది. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 100 తగ్గి రూ. 59,950 కి చేరింది. క్రితం రోజు ఇది రూ. 60,060  గా ఉంది. 

దేశవ్యాప్తంగా  ప్రధాన నగరాల్లో బంగారు ధరలు 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​59,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950గా నమోదైంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,300గాను..24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,340గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 54,950గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,950గాను ఉంది. అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,000గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,020గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,950గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950గా ఉంది.

తగ్గిన వెండి ధర..
దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం100 గ్రాముల వెండి ధర రూ. 7,670గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.73,400కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 76,000గా ఉంది.  హైదరాబాద్​లో కేజీ వెండి ధర బుధవారం కేజీకి సుమారు రూ.1000 తగ్గింది. గురువారం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.76,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.73,400.. బెంగళూరులో రూ.72,400గా ఉంది.