స్విగ్గీ, జొమాటోకు పోటీగా ONDC.. ఈ ONDC అంటే ఏంటీ

స్విగ్గీ, జొమాటోకు పోటీగా ONDC.. ఈ ONDC అంటే ఏంటీ

ఫుడ్ డెలివరీ యాప్స్ అనగానే వెంటనే గుర్తొచ్చేవి స్విగ్గీ, జొమాటో. ఈ రెండింటికీ ఇప్పుడు పోటీగా మరో ఫుడ్ డెలివరీ సంస్థ రాబోతుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ అయిన ONDC.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్‌లను ఎలాంటి అగ్రిగేటర్ అవసరం లేకుండా నేరుగా కస్టమర్‌లకు ఆహారాన్ని విక్రయించేందుకు వచ్చేస్తోంది. అంతే కాదు అత్యంత చౌకగా ఇది సేవలందించనున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు, 'బిగ్ తందూరి పనీర్ బర్గర్'ని విక్రయించే రెస్టారెంట్ స్విగ్గీ, జొమాటో రెండింటిలో దాదాపు రూ. 359 ఉంటుంది. కానీ అదే ONDCలో అయితే దాని ధర దాదాపు రూ. 270. అంటే స్విగ్గీ, జొమాటో కంటే చాలా తక్కువ.

ఇది కేవలం ఫుడ్ డెలివరీ చేయడంతో పాటు, కస్టమర్‌లు బట్టలు, కిరాణా సామాగ్రిని, సినిమా టికెట్లను కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రానిక్‌ల వస్తువులను కేవలం ఒకే క్లిక్‌లో బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. దీన్ని అమెజాన్ (Amazon) వలె కాకుండా పేటీఎం (Paytm) యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ కస్టమర్‌లు సెర్చ్ బార్‌లో 'ONDC' అని టైప్ చేసి అందుబాటులో ఉన్న రెస్టారెంట్‌ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. అందుబాటులో ఉన్న అన్ని రెస్టారెంట్లు ONDC ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆహారాన్ని విక్రయించవు. ఎందుకంటే ఇది ప్రజలకు చాలా కొత్తది. సెప్టెంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు 36 లక్షలకు పైగా ఆర్డర్స్ సప్లయ్ చేయగా.. 29 వేల కంటే ఎక్కువ మంది యూజర్స్ ఈ సేవలను ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ (2022)లో ఓఎన్డీసీని ప్రారంభించినప్పటి నుంచి దీనికి మంచి ఆదరణ వస్తోంది. ఇది ఇప్పటివరకు రోజుకు 10 వేల ఆర్డర్ల మార్కును అధిగమించింది. నెటిజన్లు కూడా ONDC, Swiggy, Zomato అందించే ఫుడ్ డెలివరీ ధరలను పోల్చగా.. ఈ మూడింటిలో ONDCనే చౌకగా ఉన్నట్లు గుర్తించడంతో దీనికే ఆకర్షితులవుతున్నారు.

ONDC అంటే ఏమిటి?

ONDC అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్, ఇది కేవలం ఒక క్లిక్‌తో ఆహారం, బట్టలు, సినిమా టిక్కెట్లు, కిరాణా .సామాగ్రి మరియు ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వివిధ వస్తువులు కస్టమర్‌లకు అగ్రిగేటర్‌గా పనిచేసే Amazon వలె కాకుండా, ONDC అనే యాప్‌లో అన్ని రకాల ఉత్పత్తులు, సేవలను పొందుపర్చారు. దీని ద్వారా కస్టమర్‌లు పైన పేర్కొన్న అన్నింటినీ ఒకే యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు.

కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఉపయోగించాలి?

ONDC అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోగలిగే యాప్ కాదు. ఇది UPI వలె పనిచేస్తుంది. Paytm, PhonePe, Meesho వంటి యాప్‌లకు ఇది లింక్ చేయబడుతుంది. 29 వేల మంది విక్రేతలున్న ఈ యాప్ లో 36 లక్షలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ONDC వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి ఒక సమగ్ర వేదిక. ఈ యాప్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నందున.. అన్ని రెస్టారెంట్లు ఈ యాప్ ద్వారా కొనుగోలు జరిపే అవకాశం లేదు.