Paytm సేవలు యథాతథం..నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంకుకు బదిలీ

Paytm సేవలు యథాతథం..నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంకుకు బదిలీ

Paytm మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ శుక్రవారం తన నోడల్ ఖాతాను Paytm పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కి మార్చినట్లు తెలిపింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన గడువు మార్చి 15 తర్వాత Paytm QR, సౌండ్ బాక్స్, కార్డ్ మెషీన్లు కొనసాగింపుకు అనుమతిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకటించారు.

యాక్సిస్ బ్యాంక్ వన్ 97 కమ్యూనికేష్స్ ఉపయోగిస్తున్న నోడల్ ఖాతాను paytm పేమెంట్స్ బ్యాంక్ తో భర్తీ చేస్తుందని భావిస్తోంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ దాని ప్రారంభం నుంచి యాక్సిస్ బ్యాంక్ సేవలను వినియోగించుకుంటోంది.

Paytm పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ లావాదేవీలను నిలిపివేయకుండా ఆర్బీఐ శుక్రవారం(ఫిబ్రవరి16) సాయంత్రం గడువును పెంచింది. గడువును ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగించింది. Paytm పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. అంటే మార్చి 15 వరకు కస్టమర్లు డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ సేవలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు , నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు చేయవచ్చు.

అయితే Paytm  పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు , వ్యాపారులు తమ ఖాతానుల మార్చి 15 లోపు ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని సెంట్రల్ బ్యాంకు తెలిపింది. Paytm  నోడల్ ఖాతా దాని కస్టమర్లు, వ్యాపారుల లావాదేవీలు పరిష్కరించబడే మాస్టర్ ఖాతాలాంటింది. ట్రాప్ సిస్టమ్ లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లో పేమెంట్ ప్రాసెసర్ యాప్ కి UPI ని యాక్సస్ చేయడానికి స్పాన్సర్ బ్యాంక్ అవసరం. ఇకనుంచి యాక్సిస్ బ్యాంక్ పీఎస్పీగా పనిస్తుంది.